Sunday, January 19, 2025

పుట్టిన రోజు నాడు మనసులో మాట బయటపెట్టిన జయప్రద

- Advertisement -
- Advertisement -

ఒకప్పటి అందాలతార జయప్రద గురించి తెలియనివారుండరు. తెలుగు నటిగా వెండితెరపై వెలిగి, ఆ తర్వాత బాలీవుడ్ లోనూ జయకేతనం ఎగురవేసిన చక్కటి నటి ఆమె. ఎన్టీఆర్ ఆహ్వానంపై 1994లో తెలుగుదేశం పార్టీలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు.  జయప్రద 1996-2002 మధ్యకాలంలో రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. తెలుగు మహిళ అధ్యక్షురాలిగానూ ఆమె సేవలు అందించారు. ఆ తర్వాత సమాజ్ వాదీ పార్టీలో చేరి, 2004-14 మధ్య కాలంలో ఎంపీగా పనిచేశారు.  ప్రస్తుతం ఆమె బిజేపీలో కొనసాగుతున్నారు.

బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ తాను యూపీలో ఉంటున్నా, తెలుగు రాష్ట్రాలకు దూరంగా లేనని, అవకాశమిస్తే బిజెపి తరఫున ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె మనసులో మాట బయటపెట్టారు. తెలుగువారికి సేవ చేయాలని ఉందన్నారామె.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News