Sunday, December 22, 2024

జయప్రద పారిపోయిన నిందితురాలు

- Advertisement -
- Advertisement -

లక్నో: ప్రముఖ నటి, మాజీ ఎంపి, బిజెపి కాయకురాలు జయప్రదను అరెస్టు చేయాలని యుపి ప్రత్యేక కోర్టు మంగళవారం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రత్యేక కోర్టులో ఆమెపై ఉన్న రెండు కేసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులలో ఏడు సార్లు నాన్‌బెయిలబుల్ వారెంట్లు ఇచ్చినప్పటికి ఇప్పటివరకు ఆమె స్పందించలేరు. ఆమెను పట్టుకునేందుకు డిఎస్‌పి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కోర్టు స్థానిక ఎస్‌పికి ఆదేశించింది. విచారణలో భాగంగా ఆమెను పరారీలో ఉన్న నిందితురాలు అని న్యాయస్థానం జడ్జి శోభిత్ బన్సల్ అధికారికంగా తెలిపారు. 2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళి ఉల్లంఘించడంతో జయప్రదపై రెండు కేసు నమోదయ్యాయి. ఆమె గత ఎన్నికలలో రాంపూర్ నుంచి పోటీ చేసి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అజాంఖాన్ చేతిలో ఓటమిని చవిచూశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News