Wednesday, January 22, 2025

సినీ నటి జయప్రదకు ఆర్నెళ్ల జైలు శిక్ష.. రూ.5వేల జరిమానా

- Advertisement -
- Advertisement -

ప్రముఖ సినీ నటి, సమాజ్ వాదీ పార్టీ మాజీ ఎంపి జయప్రదకు చెన్నై కోర్టు షాకిచ్చింది. గతంలో నమోదైన ఓ కేసులో చెన్నైలోని ఎగ్మోర్‌ కోర్టు జయప్రదతోపాటు మరో ముగ్గురికి 6 నెలలు జైలు శిక్ష విధిస్తూ రూ.5వేలు జరిమానా కూడా వేసింది. చెన్నైలోని అన్నారోడ్డులో రామ్‌ కుమార్‌, రాజబాబు, మరొకరితో కలిసి జయప్రద ఓ సినిమా థియేటర్ ను నడిపించారు. అయితే, థియేటర్ క్రమంగా నష్టాల్లో కురుకుపోవడంతో దాన్ని బంద్ చేశారు.

థియేటర్ లో పనిచేసిన కార్మికుల నుంచి ఈఎస్ఐ కోసం వసూలు చేసిన మొత్తాన్ని లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు యాజమాన్యం చెల్లించలేదు. దీంతో కార్మికులు, కార్పొరేషన్ ఎగ్మూరు కోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన కోర్టు శుక్రవారం తుది తీర్పు వెల్లడిస్తూ.. నటి జయప్రదతోపాటు మరో ముగ్గురికి జైలు శిక్ష విధించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News