Monday, December 23, 2024

టీ టిడిపి బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా జయరాజ్ యాదవ్ నియామకం

- Advertisement -
- Advertisement -

గోషామహల్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా గోషామహల్ నియోజకవర్గానికి చెందిన జి జయరాజ్ యా దవ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ జయరాజ్‌యాదవ్‌ను టీ టిడిపి బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ని యమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా టిడిపి బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన సందర్బంగా జయరాజ్‌యాదవ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.

తనపై నమ్మకంతో టీ టిడిపి బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి పదవీ బాధ్యతలు అప్పగించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, టీ టిడిపి పాలిట్ బ్యూరో సభ్యులు అరవింద్‌కుమార్ గౌడ్, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీపతి సతీష్ , సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షులు పి సాయిబాబాలకు ఆయన కృతజతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News