Thursday, January 23, 2025

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోపా కన్వీనర్‌గా సునీతగౌడ్

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి కలెక్టరేట్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గౌడ అఫీషియల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్(గోపా) జిల్లా కన్వీనర్‌గా జిల్లా యువజన క్రీడాశాఖ అధికారిని బుర్ర సునీతను నియమించినట్లు గోపా రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల రమేష్‌గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా బుర్ర సునీత గౌడ్ మాట్లాడుతూ జిల్లాలోని గౌడ కులస్తులకు, గౌడ సమాజానికి వారి అభివృద్ధికి సేవ చేస్తానని, అదే విధంగా గీతా కార్మికులు ప్రమాదాలకు గురికాకుండా సేఫ్టీ మోకులు, అధునాతన టెక్నాలజీతో ఇవ్వాలని రాష్ట్ర కల్లుగీత పారిశ్రామక సహకార కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్‌ను కోరారు.

తన నియామానికి సహకరించి గోపా హన్మకొండ జిల్లా అధ్యక్షుడు చిర్ర రాజుగౌడ్, గోపా గౌరవ అధ్యక్షులు వడ్ల వేణుగోపాల్‌గౌడ్, మోకుదెబ్బ రాష్ట్ర కార్యదర్శి బుర్ర కుమారస్వామి, జిల్లా కోకన్వీనర్ బుర్ర సదానందం, జిల్లా కోకన్వీనర్ పెరుమాండ్ల తిరుపతిగౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు కొల రాజమల్లు, గోపా యువజన నాయకులు బుర్ర రాకేష్, తెలంగాణ గౌడ సంఘం నాయకులు మాటురి రవీందర్‌గౌడ్, గౌడ సంక్షేమసంఘం అధ్యక్షులు ప్రభాకర్‌గౌడ్, తెలంగాణ గౌడ సంఘం నాయకులు తాటి అశోక్‌గౌడ్, గౌడ సొసైటీ అధ్యక్షులు, పిఏసిఎస్ డైరెక్టర్ పులి వేణుగౌడ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News