Wednesday, January 22, 2025

భూపాలపల్లిలో మహిళా కానిస్టేబుల్ పై ఎస్ఐ అత్యాచారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎస్ఐ తన రివాల్వర్ తో మహిళా కానిస్టేబుల్‌ బెదిరించి ఆమెపై రెండు సార్లు అత్యాచారం చేసిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలో జరిగింది. కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో భవాని సేన్ గౌడ్ అనే వ్యక్తి ఎస్ఐ విధులు నిర్వహిస్తున్నాడు. ఎస్సై భవాని సేన్ గౌడ్ తన ఇంటి దగ్గరలో ఉండే ఓ మహిళా కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి “ఇంట్లో జారి పడి కాలు విరిగింది లేవలేకపోతున్నాను.. వచ్చి సాయం చేయమని” ప్రాధేయపడ్డాడు. ఇంటికి వచ్చిన మహిళా కానిస్టేబుల్ ను సర్వీస్ రివాల్వర్ తో బెదిరించి అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. రెండు రోజుల క్రితం సదరు మహిళా కానిస్టేబుల్ ఇంట్లోకి చొరబడి మరోసారి అత్యాచారం చేశాడు. తనకు మంత్రి అండదండలు ఉన్నాయని ఎవరూ ఏమీ చేయలేరని పలుమార్లు మహిళా కానిస్టేబుల్ ను భయభ్రాంతులకు గురి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. చోటా మోటా నాయకులు ఎవరైనా పోలీస్ స్టేషన్ కు వస్తే తనకు మంత్రితో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పినట్టు అభియోగాలు ఉన్నాయి. ఈయన పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో 15 చికెన్ సెంటర్లు ఉండగా ప్రతిరోజూ ఒక చికెన్ సెంటర్ నుండి పావు కిలో చికెన్ పంపాలని హుకుం జారీ చేసినట్టు సమాచారం. ఆటో డ్రైవర్లు, చిల్లర వ్యాపారులను ఎవరినీ వదలకుండా  వంద రూపాయలు ఇవ్వాలని వసూళ్లకు పాల్పడేవాడని ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సదరు ఎస్ఐని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News