Wednesday, January 22, 2025

కుమారుడి వివాహేతర సంబంధం… తల్లి ప్రాణాలు తీసింది

- Advertisement -
- Advertisement -

మహాదేవ్‌పూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలంలో ఓ వ్యక్తి తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ యువకుడు, అతడి తల్లిపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి మృతి చెందగా కుమారుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అంబట్ పల్లి గ్రామంలో నర్సింహ భార్యతో అవినాష్ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు అతడిని అనుమానం ఉంది. అవినాష్ చంపాలని నర్సింహ నిర్ణయం తీసుకున్నాడు. బుధవారం శివాలయం సమీపంలో ఉన్న నర్సింహ్మపై అవినాష్ గొడ్డలితో దాడి చేస్తుండడంతో తప్పించుకొని పారిపోయాడు. నర్సింహ్మ అవినాష్ ఇంటికి వెళ్లాడు. అతడి తల్లి నల్ల పద్మ కనిపించడంతో గొడ్డలి తీసుకొని దాడి చేశాడు. ఈ దాడిలో నల్ల పద్మ ఘటనా స్థలంలోనే చనిపోయింది. అవినాష్ తండ్రి భూమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News