Thursday, January 23, 2025

ఆ కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించడం నా అదృష్టం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి: ప్రొఫెసర్ జయశంకర్ సారు పేరు పెట్టిన జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని తాను ప్రారంభించడం తన అదృష్టమని మంత్రి కెటిఆర్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు.  వేరే రాష్ట్రాల సెక్రటేరియట్ల కంటే గొప్పగా జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పి కార్యాలయం ఉందని మంత్రి కొనియాడారు. తొమ్మిదిన్నర సంవత్సరాల తెలంగాణ ప్రగతి సమగ్ర సమతుల్యత, సమ్మిళితం అని, దేశంలోని ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి తెలంగాణలో జరిగిందని ప్రశంసించారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా 11వ స్థానం, జనాభా పరంగా 12వ స్థానం, అభివృద్ధిలో 4వ స్థానం, ఫర్ క్యాపిటల్ ఇన్ కమ్ లో 1వ స్థానంలో తెలంగాణ ఉంది. ఐటి, వ్యవసాయ ఉత్పత్తుల, పరిశ్రమలు పర్యావరణంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు. ఒకవైపు అభివృద్ధి, మారో వైపు సంక్షేమంతో పాటు దేశంలో ఎప్పుడు అవార్డులు వచ్చిన తెలంగాణ మొదటి 10స్థానాల్లో ఉందని మెచ్చుకున్నారు. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.

Also Read: మిస్ టీన్ అమెరికాగా భారతీయ సంతతికి చెందిన మెక్సికన్ విద్యార్థిని

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News