- Advertisement -
హైదరాబాద్: ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా అసెంబ్లీ హల్ లో జయశంకర్ సర్ చిత్రపటానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి విప్ ఎం.ఎస్. ప్రభాకర్, శాసన సభ చీఫ్ విప్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూధన చారి, శేరి సుభాష్ రెడ్డి, కాటేపల్లి జనార్థన్ రెడ్డి, భాను ప్రసాద్, తాత మధు, దండే విఠల్, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రెటరీ డా. నరసింహా చార్యులు,టి ఆర్ ఎస్ ఎల్.పి. కార్యదర్శి రమేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -