Thursday, December 19, 2024

జయశంకర్ సర్ ఉద్యమ స్ఫూర్తి నింపారు: కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రొ.జయశంకర్ పుట్టిన రోజున ఆయన విగ్రహ ప్రతిష్ఠాపన చేయడం ఆనందంగా ఉందని ఎంఎల్‌సి కవిత తెలిపారు. మేడ్చల్‌లో ఎంఎల్‌సి కవిత, మంత్రి మల్లారెడ్డి పర్యటించారు. ప్రొ.జయశంకర్ సర్ జయంతి సందర్భంగా కెఎల్‌ఆర్ వెంచర్-2లో అమరవీరుల స్థూపం వద్ద జయశంకర్ సర్ విగ్రహాన్ని కవిత, మల్లారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. ప్రొ.జయశంకర్ తమ కుటుంబ సభ్యులు, ఆయన నుంచి అనేక అంశాలు నేర్చుకున్నామన్నారు. ప్రొ. జయశంకర్ అందరిలో ఉద్యమ స్ఫూర్తి నింపారని కవిత కొనియాడారు.

Also Read: ఆర్టీసి భూములపై కెసిఆర్ కుటుంబం కన్ను పడింది: కిషన్ రెడ్డి

తెలంగాణ ఉద్యమంలో ఎన్ని అవహేళనలు ఎదురైనా ఎక్కడా అధైర్యపడలేదన్నారు. ఇదే రోజున అన్ని జిల్లాల్లో జాగృతి వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని కవిత వివరించారు. కళ్యాలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలతో ప్రతి ఆడబిడ్డ ముఖంలో చిరునవ్వులు చూస్తున్నామని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్ రావు, బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీనివాస్ భార్యను సన్మానించడం జరిగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో అమరుడైన మేడ్చల్ కు చెందిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయలు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News