Friday, November 15, 2024

తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

 

Jayashankar sir jayanthi

హైదరాబాద్: తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ సార్ అని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.  నీళ్లు నిధులు నియామకాలు సార్ కల అని, సిఎం కెసిఆర్ ఆ కలను నిజం చేసి చూపించారని ప్రశంసించారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో లేని డబుల్ ఇంజిన్ అభివృద్ధి తెలంగాణలోనే ఉందన్నారు.  పెద్దపల్లి పట్టణంలో బస్టాండ్ చౌరస్తా లో ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి హరీష్ రావు నివాళులు అర్పించారు.  విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ప్రొఫెసర్ గా కెసిఆర్ కి ఆప్తుడుగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారని గుర్తు చేశారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ, రాష్ట్రం ఎందుకు అవసరమో అవగాహన కల్పిస్తూ ఉద్యమాన్ని ఏకతాటిపైకి నడిపించిన ఉద్యమకారుడు జయశంకర్ సార్ అని అభివర్ణించారు. నాలుగు దశాబ్దాలు ఉద్యమాన్ని సజీవంగా ఉంచడంలో గొప్ప పాత్ర పోషించారన్నారు. శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను బలంగా బల్లగుద్ది చెప్పిన వ్యక్తి అని హరీష్ రావు కొనియాడారు. తెలంగాణకు నీళ్లు నిధులు నియామకాలు జయశంకర్ సార్ కల అని, అది ఈ రోజు తెలంగాణ ప్రజలకే దక్కుతున్నాయన్నారు.  ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపి వెంకటేష్ నేత, పెద్దపెల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

May be an image of 3 people, people standing and text that says "స్ఫూర్తిప్రధాతకు నమస్సులు నేడుకీ.శే.ప్రా. జయశంకర్ గారి వర్థంతి 06-August-1934 -21-June-2011"

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News