- Advertisement -
కొలంబో: శ్రీలంక క్రికెట్ టీమ్ ప్రధాన కోచ్‌గా మాజీ స్టార్ ఆటగాడు సనత్ జయసూర్యను నియమించారు. ప్రస్తుతం జయసూర్య లంక టీమ్‌కు తాత్కాలిక హెడ్ కోచ్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల కాలంలో జయసూర్య పర్యవేక్షణలో శ్రీలంక టీమ్ చారిత్రక విజయాలను సాధిస్తోంది. అతను కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. అంతేగాక ఇంగ్లండ్ గడ్డపై టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించింది. దీంతో పాటు న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఇలాంటి స్థితిలో జయసూర్యను పూర్తి స్థాయి కోచ్‌గా నియమించాలని లంక క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఈ విషయాన్ని లంక బోర్డు సోమవారం అధికారికంగా ప్రకటించింది. 2026లో జరిగే టి20 వరల్డ్‌కప్ వరకు జయసూర్య లంక టీమ్‌కు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తాడు.
- Advertisement -