Saturday, November 16, 2024

తెలంగాణలో పసుపు విప్లవం

- Advertisement -
- Advertisement -

 వంటనూనెల ఉత్పత్తిలో భారీ వృద్ధి
 రైస్‌బ్రాన్ సదస్సులో జయేష్ రంజన్
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో రైతుల ఉత్సాహం ప్రభుత్వ ప్రోత్సాహంతో తెలంగాణ రాష్ట్రంలో పసుపు విప్లవం ప్రారంభమైందని ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు. ఇంటర్నేషనల్ ఆసోసియేషన్ ఆఫ్ రైస్‌బ్రాండ్ ఆయిల్, ది సా ల్వెంట్స్ ఎక్స్‌ట్రాక్షన్ ఇండియా సంయుక్తంగా మూడు రోజులపాటు నిర్వహిస్తున్న రైస్‌బ్రాన్ ఆయిల్ అంతర్జాతీయ సదస్సులో భాగంగా శనివారం రెండవ రోజు కార్యక్రమంలో జయేష్ రంజన్ ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఎడిబుల్ ఆయిల్ ఉత్పత్తిలో వృద్ధితో తెలంగాణ పసుపు విప్లవాన్ని చూస్తోందని, రాష్ట్రంలో వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోందన్నారు.

ప్రభుత్వ బడ్జెట్లో 60శాతం వ్యవసాయ వృద్ధిపైనే ఉందని, రైతులకు ప్రత్యక్ష ప్రయోజనాలను అందిస్తున్నట్టు తెలిపారు. రైతు బంధు, రైతు బీమా, పంటల బీమా ప్రయోజనాలతో పరిశోధనల అభివృద్ధి కోసం అగ్రి యూనివర్సిటీ కృషి చేస్తోదన్నారు. ప్రభుత్వం పరిశ్రమను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని, రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలకోసం టిఎస్‌ఐపాస్ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.వరి ఉత్పత్తిలో భారీ వృద్ధి ఉందన్నారు.

ఇప్పుడు ఆయిల్ పామ్ సాగు కోసం సుమారు 20లక్షల హెక్టార్ల భూమి ని బదిలీ చేసినట్టు తెలిపారు. దీనితో తెలంగాణ అతిపెద్ద చమురు ఉత్పత్తిని కలిగిన రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇది దేశం వంటనూనెల దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా గొప్ప ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుందన్నారు. తెలంగాణలో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేసామని, వాటి వృద్ధికి అ త్యుత్తమ మౌలిక సదుపాయాలు, మద్దతు వ్యవస్థలను అందిస్తున్నామన్నారు. తెలంగాణ భౌగోలికంగా దేశం నడిబొడ్డున ఉందన్నారు. దీనివల్ల లాజిస్టిక్ కనెక్టివిటీతో సులభంగా యాక్సెస్ చేయవచ్చని తెలిపారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ రైస్‌బ్రాన్ సదస్సు ఏర్పాటు ద్వారా ఎడిబుల్ ఆయిల్ దిగ్గజాల భారీ సమ్మేళనాన్ని చూసినందుకు తాను సంతోషిస్తున్నానని, హైదరాబాద్‌లో ఇంత ప్రతిష్టాత్మకమైన సదస్సు నిర్వహించడం గర్వంగా భావిస్తున్నట్టు తెలిపారు.

బియ్యం ఉత్పత్తిలో భారీ వృద్ధి
ఐఏఆర్‌బివో ప్రెసిడెంట్ అశోక్ సేథియా మాట్లాడుతూ భారతదేశం బియ్యం ఉత్పత్తిలో భారీ వృద్ధిని సాధించిందన్నారు. రైస్ బ్రాన్ ఆయిల్ బియ్యం యొక్క ఉప ఉత్పత్తిని ఉత్తమంగా ఉపయోగిస్తుందన్నారు. దేశంలోనే అత్యధికంగా రైస్ మిల్లులు అధికంగా వరి ఉత్పత్తి చేసే తెలంగాణలో ఈ సదస్సు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సదస్సు రైస్ బ్రాన్ ఆయిల్ రంగంలో పరిశ్ర మ నిపుణులు, పరిశోధకుల సంగమం అన్నారు.పరిశ్రమ పరిష్కరించాల్సిన కొన్ని సవాళ్లు నిల్వ, ప్రాసెసింగ్ సమయంలో నష్టాన్ని తగ్గించడానికి, సూక్ష్మపోషకాల నష్టా న్ని తగ్గించడానికి కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయ డం. ఈ కాన్ఫరెన్స్ ఉపకరిస్తుందన్నారు.

ఎస్‌ఈఎ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మెహతా మాట్లాడుతూ, ప్రపంచంలో భారతదేశం వరి ఉత్పత్తిలో 2వ అతిపెద్దదేశం అన్నారు. దేశంలోని మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో దాదాపు 40శాతం వరిసాగు ఉందన్నారు. 1.9 మిలియ న్ టన్నుల సామర్థ్యంతో 1.05 మిలియన్ టన్నుల రైస్ బ్రాన్ ఆయిల్ ఉత్పత్తి చేస్తూ ప్రపంచంలోనే రైస్ బ్రాన్ ఆయిల్ ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశంగా నిలిచిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News