Saturday, November 23, 2024

కెసిఆర్ ను కలవడానికి వచ్చా: జెసి దివాకర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణను వదిలిపెట్టి చాలా నష్టపోయామని జెసి దివాకర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలువడానికి ఎపి టిడిపి నేత జెసి దివాకర్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలో కెసిఆర్, కెటిఆర్‌ను జెసి కలిశారు. తెలంగాణలో పాలన బాగుందని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌ను వదిలేసి తెలంగాణకు వస్తానన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మంచి మిత్రుడని, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో జానారెడ్డి ఓడిపోతాదని తనకు ముందే తెలుసునన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఇప్పటి వరకు కలవలేదని, అందుకే ఇప్పుడు కలిశానన్నారు. తెలంగాణ వీడిపోవడంతో రాయలసీమకు అన్యాయం జరిగిందని, రాయలసీమ కూడా తెలంగాణతో కలిసుంటే బాగుండేదని చెప్పారు. రాయల్ తెలంగాణను కాంగ్రెస్ సీనియర్ దివంగత నేత జైపాల్ రెడ్డి వ్యతిరేకించారని గుర్తు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి తనకు తెలియదని, రెండు సంవత్సరాల నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని జెపి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News