- Advertisement -
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ప్రగతి భవన్ వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బుధవారం ఉదయం ప్రగతి భవన్ వద్దకు వచ్చిన జేసి దివాకర్ రెడ్డి అపాయింట్ మెంట్ లేకుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, అక్కడున్న పోలీసు అధికారులు అపాయింట్ మెంట్ లేకుండా లోనికి అనుమతించడ కుదరదని ఆయనను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన జేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు నచ్చజెప్పడంతో చేసేదేమి లేక అక్కడి నుంచి ఆయన తిరిగి వెళ్లిపోయారు.
JC Diwakar Reddy tries enter into Pragathi Bhavan
- Advertisement -