Wednesday, January 22, 2025

జెసి ప్రభాకర్ రెడ్డి ముఖ్యఅనుచరుడిపై హత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

అమరావతి: మాజీ ఎంఎల్‌ఎ, మున్సిపల్ ఛైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఐటిడిపి పట్టణాధ్యక్షుడు గండికోట కార్తీక్‌పై గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గత రాత్రి 12 గంటల సమయంలో ఆయన ఇంటికి వెళ్తుండగా కొందరు దుండగులు ఆయనపై కత్తులు, కర్రలతో దాడి చేశారు. వెంటనే స్థానికులు స్పందించి అతడిని ఆస్పత్రికి తరలించారు. జగన్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ సోషల్ మీడియాలో కార్తీక్ షేర్ చేయడంతో వైసిపి చేందిన వారు తనపై హత్యాయత్నం చేశారని ఆయన ఆరోపణలు చేశాడు. ప్రభాకర్ రెడ్డికి ముఖ్య అనుచరుడు కావడంతో ఆయన శత్రువులు ఈ దాడికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాయలసీమ అంటేనే ఫ్యాక్షనిజం… టిడిపి, వైసిపి కార్యకర్తలు పగలతో రెచ్చిపోతున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News