- Advertisement -
న్యూస్ డెస్క్: భారీ కొండ చరియ విరిగిపడినప్పటికీ ఒక జెసిబి డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లా చండీగఢ్-మనాలి హైవేపై చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హైవేపై 6వ మైలు వద్ద శకలాలను తొలగిస్తున్న జెసిబిపై ఒక భారీ కొండ చరియ రొర్లుకొంటూ వచ్చి పడింది. జెసిబి యంత్రాన్ని ఆపరేట్ చేస్తున్న డ్రైవర్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. దీంతో ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని జిల్లా యంత్రాంగం మండి, పండో మధ్య హైవేపై వాహనాల రాకపోకలను బుధవారం నిలిపివేసింది. అశాస్త్రీయంగా కొండలను తొలచడంతో ఆ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.
- Advertisement -