Friday, January 3, 2025

సాహో.. సుభాన్

- Advertisement -
- Advertisement -

మున్నేరు వరదలో చిక్కుకున్న 9 మందిని కాపాడిన రియల్ హీరో
అత్యంత ధైర్యసాహసాలతో వరదలోకి వెళ్ళిన జెసిబి డ్రైవర్
ఎల్లెడలా ప్రశంసల జల్లులు

వనం వెంకటేశ్వర్లు
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగర మున్నేరు వరదలో చిక్కుకున్న 9 మందిని కాపాడిన జెసిబి డ్రైవర్ ఎస్ కె సుభాన్ ఇప్పుడు రియల్ హీరో అయ్యాడు. వందేళ్ళ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మహ ఉదృత్తంగా ప్రవహిస్తున్న మున్నేరులో ప్రకాశ్ నగర్ వంతనపై చిక్కుకున్న వెంకటగిరి గ్రామానికి చెందిన 9 మందిని అత్యంత ధైర్యసాహసాలు చేసి రక్షించాడు. చివరికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఎన్‌డిఆర్‌ఎఫ్ బృంధం సైతం వెనుకడగు వేసినప్పటికీ ఒక సామాన్య జెసిబి డ్రైవర్ అత్యంత ధైర్యసాహసంతో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వీరుడిలా ముందుకు వెళ్లి, తొమ్మిది మందిని రక్షించి తన జెబిసి బకెట్ ద్వారా సురక్షితంగా బైటికి తీసుకొచ్చి వెంకటగిరి గ్రామస్థులతోపాటు జిల్లా అధికారుల ప్రశంసలు అందుకున్నాడు.

ఒక దశలో ప్రాణం మీద ఆశలు వదలు కొని దాదాపు 13 గంటల పాటు వరద ఉధృతిలో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ నరకయాతన అనుభవించిన వారిని వరద నుంచి బైటికి కాపాడి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఖమ్మం నగరంలో మొన్నటి భారీ వర్షానికి మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆకేరు, పాలేరు వంటి నదులు ఉప్పొంగి ప్రవహించడంతో మున్నేరు ఉరకలేసింది. ఖమ్మం నగరంను చీల్చుకుంటూ వెళ్తున్న మున్నేరుపై ప్రకాశ్‌నగర్ వంతెన పరిసర ప్రాంతాలు మొత్తం జలమయం అయ్యాయి.

ప్రకాశ్‌నగర్ బ్రిడ్జి సమీపంలోని సిమెంట్ ఒరలు తయారు చేసే బ్రిక్స్ కంపెనీలోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. దీంతో సదరు బ్రిక్ కంపెనీ యజమాని వోగబోయిన శ్రీనివాసరావు, ఆయన కుమారుడు విక్రమ్, అందులో పనిచేసే వర్కర్లు వినోద్, వెంకన్న, కట్టెలమండి వాచ్‌మెన్ మోహన్, లక్ష్మిదంపతులు, వారి కుమారులు ఇద్దరు, మరో వ్యక్తి బైటికి వచ్చి సమీపంలో ప్రకాశ్‌నగర్‌లోని వారి ఇళ్ళ వద్దకు వెళులి ఇంటి సామగ్రిని సర్దుకుని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుజీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళే క్రమంలో ప్రకాశ్ నగర్ మున్నేరు వంతనెపైకి దాదాపు ఉదయం 10 గంటల సమయంలో వచ్చారు.

ఖమ్మం రూరల్ మండలం, వెంకటగిరి గ్రామానికి చెందిన వీరంతా ప్రకాశ్‌నగర్‌లో అద్దె ఇంట్లో ఊంటూ కూలి పనులు చేసుకుంటున్నారు. అయితే అప్పటికే బ్రిడ్జిపైకి పూర్తి స్థాయిలో నీరు చేరలేదు. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు ఉండటం వల్ల ఎత్తు ప్రాంతంలో ఉన్న బ్రిడ్జి మీదికి ఈ 9 మంది వచ్చారు. చిన్నచిన్నగా బ్రిడ్జిపైకి దాదాపు మూడు అడుగుల మేర వరద నీరు వచ్చి చేరింది. దీంతో వారు ఎక్కడికీ వెళ్ళలేక వరదలోనే చిక్కుకుపోయారు. వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్ ద్వారా తాము ఇక్కడ చిక్కుకుపోయామని బంధువులకు, వెంకటగిరి గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. ఈవిషయం దవానంలా అంతటా పాకింది. అధికారులంతా బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. సమయం గడుస్తున్నకొద్దీ వరద పెరుగుతోంది. దీంతో హెలిక్యాప్టర్ ద్వారా రక్షించేందుకు జిల్లాకు చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విశ్వప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్మీ హెలిక్యాప్టర్ తెప్పించేందుకు ప్రయత్నించారు. మంత్రి తుమ్మల ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్‌తో కూడా మాట్లాడారు.

రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు, ఢిల్లీలోని ఆర్మీ ఉన్నతాధికారులతో కూడా మాట్లాడారు. ముందుగా ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాన్ని తెప్పించేందుకు ప్రయత్నించారు. విజయవాడ, విశాఖ పట్టణంలో హెలిక్యాప్టర్లు సిద్ధమైనప్పటికీ సిద్ధమైనప్పటికీ అవడానికి వాతావరణం అనుకూలించకపోవడం వల్ల అవిఖమ్మం నగరానికి రాలేకపోయాయి. అయితే ఎన్‌డిఆర్‌ఎఫ్ రిస్క్ బృందం వచ్చినప్పటికీ వారు కూడా వెళ్లడానికి సాహసించలేకపోయారు. అప్పటికి సాయంత్రం ఆరు దాటింది. వరదలో చిక్కుకున్న వారి బంధువులు మున్నేరు బ్రిడ్జికి వెంకటగిరి గ్రామ వైపు ఉంటూ ప్రయివేట్ ఆగ్రీ డ్రోన్‌ల సహాయంతో వరదలో ఉన్న 9 మందికి లైఫ్ జాకెట్లను, బిస్కెట్ ప్యాకెట్లను పంపించారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఏటికి అటు వైపు (ప్రకాశ్‌నగర్ సమీపంలో) ఉండి వీరిని రక్షించేందుకు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

మరో మంత్రి పొంగులేటి కూడా అక్కడికి వెచ్చి ఆంధ్రప్రదేశ్‌లోని ఉన్నతాధికారులతో మాట్లాడారు. మరోవైపు వెంకటగిరి గ్రామానికి చెందిన మొర్రిమేకల ఉపేందర్, జవహర్‌లాల్, కనపర్తి నాగేశ్వర్ రావు, ప్రకాశ్ నగర్ కు చెందిన జెబిసి యజమాని వెంకటరమణ ఏవిధంగానైనా ఆ 9 మందిని కాపాడాలని శతవిధాలా ప్రయత్నించారు. సాయంత్రం సమయంలో జెసిబితో వెళ్లి వారిని రక్షించి తీసుకొస్తామని జెసిబి యజమాని పోలీసులకు చెప్పినప్పటికీ అక్కడ భద్రతగా ఉన్న పోలీసులు బ్రిడ్జిపైకి వెళ్ళేందుకు అనుమతి ఇవ్వలేదు. అయితే రాత్రి 9 గంటల సమయంలో ఆ 9 మంది ప్రాణాలను రక్షించే బాధ్యత తమదేనని, అందుకు గ్రామ పెద్దలు వీడియో సాక్ష్యాన్ని నమోదు చేయగా అప్పుడు జెబిసిని మున్నేరు బ్రిడ్జిపైకి వెళ్ళేందుకు పోలీసులు అంగికరించారు. దీంతో జెసిబి యజమాని పుట్టబంతి వెంకటరమణ తన జెసిబి డ్రైవర్ ఎస్ కె సుభానీని పిలిపించారు.

జెసిబికి నష్టం జరిగినా ఫరవాలేదు.. ఆ 9 మంది ప్రాణాలతో తిరిగి రావడం ముఖ్యమని భావించారు. ఉప్పెనలా వస్తున్న వరద ఉధృతిలో తాను వెళ్ళబోనని జెసిబి డ్రైవర్ ముందు కాస్తా అధైర్యపడినప్పటికీ వెంకటగిరి గ్రామస్థులు మొర్రి మేకల ఉపేందర్ , జెసిబి యజమాని వెంకటరమణ ప్రోత్సహించడంతో ధైర్యం కూడగట్టుకున్నారు. హర్యానా రాష్ట్రంలో మెవాత్ జిల్లాకు చెందిన ఎస్ కె సుభానీ జెసిబి డ్రైవర్‌గా 20 ఏళ్ళ అనుభవం ఉంది. అయితే వరదలో చిక్కుకున్నవాళ్ళు బ్రిడ్జిపైన ఉన్నారు. లోతట్టులో దాదాపు 9 అడుగుల ఎత్తులో వరద ప్రవహిస్తోంది. దీనికి తోడు బ్రిడ్జికి లోతట్టు మధ్యలో రోడ్డు కోతకు గురైంది. దీంతో జెబిసి ముందుకు వెళ్లడానికి ప్రయత్నం చేసినప్పటికీ కదలేకపోయింది. రెండు పర్యాయాలు ముందుకు వెళ్లి మళ్ళీ వెనక్కి వచ్చాడు. మూడో ప్రయత్నంగా ధైర్యం చేసి ముందుకువెళ్ళాడు.

ఈసారి జెబిసి డ్రైవర్ ‘ పోతే తన ఒక్క ప్రాణం పోతుంది.. వస్తే తనతోపాటు పది మంది ప్రాణాలు తిరిగి వస్తాయి అంటూ’ ముందుకు సాగాడు. జెసిబి ఇంజన్ మొత్తం నీ ళ్ళలో ముగినిపోయింది. అయినప్పటికీ రోడ్డు కోతకు గురికావడం వల్ల జెబిసి ముందుకు వెళ్ళలేకపోయింది. దీంతో జెబిఎస్ తొండం, రెండు లెగ్గులు, మరో రెండు స్టాండ్లు వేసి లోతట్టులో ఉన్న జెబిసి, దాని తొండంను మున్నేరు బ్రిడ్జికి అనుసంధానం చేశాడు. అప్పటికే బ్రిడ్జిపై వరద నీరు కొంత మేర తగ్గింది. దీంతో బ్రిడ్జిపైన కొంతదూరంలో ఉన్న 9 మందిని ఒక్కొక్కరిని తాడు సహాయం తో జెబిసి బకెట్‌లో సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చా డు. దాదాపు రెండున్నర గంటల రిస్కు ఆపరేషన్ చే యడం వల్ల ఆ తొమ్మిది మంది రాత్రి 11.30 గంటలకు సురక్షితంగా బైటికి వచ్చారు.

ఈ విషయం తెలిసిన తరువాతనే ఏటికి అటువైపు ఉన్న మంత్రి తుమ్మల అక్కడి నుంచి కదిలివెళ్ళారు. ‘బతుకు మీద ఆశలు వదులకున్నాం.. చచ్చిపొతాం అనుకున్నం.. కానీ జెసిబి డ్రైవర్ ధైర్యంతో తిరిగి ప్రాణాలతో వచ్చాం’ అని ఆ 9 మంది వాపోయారు. దాదాపు 13 గంటల పాటు అత్యంత భ యంకరంగా గడిపామని కళ్ళ ముందు నుంచే పా ము లు, తేళ్ళు వెళ్తుంటే భయం వేసిందన్నారు. వీరిని కాపాడిన డ్రైవర్ సుభాన్ సాహసాన్ని వెంకటగిరి గ్రామస్థులు మెచ్చుకొని శభాష్ అంటూ అభినందించారు. జెసిబి డ్రైవర్, యజమాని, వెంకటగిరి గ్రామ పెద్దలు ఇప్పుడు రియల్ హీరోలు అయ్యారు. వీరందరికీ ప్రభుత్వం తరపున సాహస అవార్డులు ఇప్పించేందుకు జిల్లా యం త్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది.

పోతే ఒక్కడిని… వస్తే పది మంది: జెసిబి డ్రైవర్ ఎస్ కె సుభాన్
‘హర్యానా రాష్ట్రానికి చెందిన నేను గత 20 ఏళ్ళుగా జెసిబి డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. ఖమ్మం నగరానికి వచ్చి అయిదేళ్ళు అవుతోంది. ప్రస్తుతం వెంకటరమణ వద్ద గత ఏడాది నుంచి పనిచేస్తూ వారి ఇంట్లోనే ఉంటున్నాను. భార్య, పిల్లలు హర్యానాలోనే ఉంటారు. నా యజమాని వరదలోకి వెళ్ళే ధైర్యం ఉందా? అని అడిగారు. ముందు కొంత సంకోచించినప్పటికి ఆ తరువాత కొంత ధైర్యం తెచ్చుకున్నాను. ‘పోతే ఒక్క ప్రాణం పొతుంది.. వస్తే నాతో పాటు పది మంది మి తిరిగి వస్తాం’ అని సాహసించి ముందుకు కదిలాను. రెండు పర్యాయాలు ప్రయత్నించి విఫలం అయ్యాను. మూడోసారి మాత్రం వెంకటగిరివాసుల సహకారంతో ధైర్యంగా ముందుకు వెళ్లి, వారిని సురక్షితంగా తీసుకొని వచ్చాను. అందరూ తనను శభాష్ అంటూ సత్కరించడం ఎంతో సంతోషంగా ఉంది. వెంకటగిరివాసులంతా నన్ను ఎంతో అభినందించారు. మాఈ మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ నన్ను శాలువాతో సత్కరించారు. ఈ సంతోషాన్ని నా భార్య పిల్లలతో పంచుకోవడానికి ఈ రోజు మా స్వగ్రామానికి వెళ్తున్నాను.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News