Friday, December 20, 2024

నెల్లూరులో ఇంటిగ్రేటెడ్ వర్క్ షాప్ ప్రారంభించిన జెసిబి ఇండియా

- Advertisement -
- Advertisement -

JCB India launches Integrated workshop in Nellore

నెల్లూరు: ఎర్త్ మూవింగ్, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ పరంగా భారతదేశంలో అగ్రశ్రేణి తయారీదారులుగా JCB India ltd., ఉంది. Goldfields JCB యొక్క నూతన షోరూమ్ మరియు ఇంటిగ్రేటెడ్ వర్క్ షాపును నెల్లూరులో ప్రారంభించబడినది. JCB India ltd., యొక్క వినూతనమైన ఉత్పత్తి జాబితాను అందించేటువంటి ఈ అత్యాధునిక కేంద్రం సాటిలేని ఉత్పత్తి, మద్దతు మరియు అనుభవాలను నెల్లూరు మరియు చుట్టూ పక్కల వినియోగదారులకు అందించనున్నారు. దాదాపు 14000 చదరపు అడుగుల విస్తీర్ణములో నిర్మించబడిన ఈ నూతన 3S ఇంటిగ్రేటెడ్ కేంద్రములో దాదాపు 220 మంది ఉద్యోగులు విధులను నిర్వహించుచున్నారు. వీరిలో దాదాపు 10 శాతం మహిళలు. కస్టమర్స్ యొక్క అవసరాలకు అనుకూలంగా సేల్స్, సర్విస్ మరియు పార్ట్స్ కు సంభందించిన సేవలు అందించడానికి అనభావాగ్యులయిన సిబ్బంధి ఉన్నారు.

ఈ కేంద్రంలో 5 వాహనాలు వక్కేసారి సర్వీన్ చేయ గలిగిన సామర్ధ్యం ఉన్న ఇంటిగ్రేటెడ్ సర్వీసు వర్క్ షాప్ తో పాటు లైవ్లిoక్ కమాండ్ సెంటర్ ద్వారా ప్రపంచ శ్రేణి అనుభవాలను కస్టమర్లకు అందిస్తుంది. GoldFields JCB ప్రస్తుతం 5 రూరల్ గ్రోత్ సెంటర్స్ ను, 6 పార్ట్స్ ఔటలెట్, 6 ఇంటిగ్రేటెడ్ సర్వీస్ వర్కషాప్ ఆంధ్రప్రదేశ్ లో కలిగి ఉన్నది.

ఇది JCB వినియోగదారుల నాణ్యమైన ప్రోడక్ట్ కు ఎన్నడు దూరంగా ఉండరాదని నిర్ధారిస్తుంది

JCB India, JCB India Managing Director, CEO అయినా గౌరవనీయులైన దీపక్ శెట్టి గారు మాట్లాడుతు GoldFileds JCBతో మా సుదీర్ఘ భాగస్వామ్యాన్ని 1998లో ప్రారంభమైనది. ఈ ప్రాంతంలోని మా వినియోగదారుల ప్రయోజనార్థం ఈ నూతన ప్రపంచ శ్రేణి కేంద్రాన్ని నేడు ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రతి ఒక్కరూ అధికంగా దృష్టి సారిoచడం వల్ల భవిష్యత్తులో మా ఉత్పత్తులకు అధిక డిమాండ్ ను చూడగలమని భావిస్తూ ఉన్నాము . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పరంగా ముందంజలో ఉంటుంది. ఈ నూతన కేంద్రం మా నిబద్ధతను పునరుద్ధ్ఘటించటంతో పాటుగా మా వినియోగదారులకు అత్యుత్తమ అనుభవాల సైతం అందించనుంది అని ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు తో పాటుగా అనంతపూర్, అన్నమయ్య, చిత్తూరు, కడప, తిరుపతి, శ్రీ సత్యసాయి మరియు ప్రకాశం జిల్లాలో GoldFields JCB సేవలను అందిస్తుంది.

ఈ సంస్థ త్వరలోనే ప్రత్యేకంగా ఆపరేటర్ ట్రైనింగ్ ప్రోగ్రాం “సారధి”ని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరాంతం లోపుగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా JCB మిషన్ ఆపరేటర్లకు భద్రత అత్యున్నత సమర్థత మరియు నైపుణ్యము పరంగా శిక్షణను అందించనున్నారు.

JCB కార్పొరేట్ గుర్తింపు మార్గదర్శకాలు ప్రపంచ స్థాయి అనుభవాన్ని కస్ట్మర్లకు అనుగుణంగా గోల్డ్ పీల్స్ JCB కార్యకలాపాలను నిర్వహించటంతో పాటు JCB ప్రామాణికర వ్యవస్థలు, ప్రక్రియలు కలిగి ఉంటుంది. ఈ కేంద్రంలోని అత్యాధునిక పూర్తిస్థాయి కార్యకలాపాలు నిర్వహిస్తున్న లైవ్ లింక్ కమాండ్ సెంటర్ 24 గంటలు ఫ్లీట్ మేనెజ్మెంట్ మద్దతు వినియోగదారులకు అందిస్తుంది. అత్యాధునిక టెలీ మ్యాట్క్స్ సాంకేతికత. JCB లైవ్ లింక్ ఇది నిర్మాణాంతకంగా వాస్తవ సమయంలో సమాచారాన్ని సైటు సామర్ధ్యాన్ని మెరుగు పరచడంతో పాటు మిషిన్ ఉత్పాదకతను మెరుగు పరుస్తుంది. ఇది JCB మిషన్స్ సేవలు నిర్వహణ భద్రతకు సంబంధించిన సమాచారము అందిస్తుంది. దీని ద్వారా JCB అత్యంత వేగంగా తమ మిషన్ల పరంగా వినియోగదారుల అనుభవాలను సైతం మెరుగుపరచనుంది.

JCB India launches Integrated workshop in Nellore

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News