Monday, December 23, 2024

సామాజిక సేవల్లో జేసీఐ హైదరాబాద్ దక్కన్‌కు ప్రత్యేక గుర్తింపు

- Advertisement -
- Advertisement -

గోషామహల్: నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాలతో జేసీఐ హైదరాబాద్ దక్కన్ ప్రత్యేక గుర్తింపు పొందిందని జేసీఐ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ జెఎఫ్‌ఎస్ కార్తికేయన్ అన్నారు. ఈ మేరకు ఆదివారం సీతారామ్‌బాగ్‌లో జేసీఐ హైదరాబాద్ దక్కన్ సామాజిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్తులకు ఉచితంగా పుస్తకాలు, నోటు బుక్స్ పంపిణీ చేశారు. అదే విధంగా జగన్నా ధ్‌మఠ్‌లో పీడింగ్ జెబీఎస రూమ్, సోలార్ వాటర్ హీటర్లను విరాళంగా అందజేశారు.

ఈ సందర్బంగా కార్తికేమన్ మాట్లాడుతూ సమాజ సేవ చేయడ మే స్వచ్చంథ సంస్థల ఆశయమని అన్నారు. జేసీఐ హైదరాబాద్ దక్కన్ అధ్యక్షులు జెఎఫ్‌ఎం రితేష్ భలాడ్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో హై దరాబాద్ నలుమూలల నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. జగన్నాథ్‌మఠ్‌లో అనాథల కోసం పీడింగ్ జేబీస్ రూ మ్స్ ఏర్పాటు చేయడంతో పాటు సోలార్ వాటర్ హీటర్, 800 మంది విద్యార్థుల కోసం ఒక రిప్రిజిరేటర్‌ను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రతినిధులు నిధి గుప్తా, రమేష్ దడిగాల, అభినయ్ బర్మేచా, మహేష్ రాఠీ, బ్రిజేష్ సింగ్, సందీప్ దారక్, రితేష్ జప్నాని, విభా బన్మేచ, సిద్దాంత్ జైన్, ప్రణీత బొగ్గారపు. సుఖేస్ జవహర్, రాహుల్ మంత్రి, ముఖేస్ కేడియా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News