Wednesday, January 22, 2025

ఎమోషనల్ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జెడి చక్రవర్తి, శుభ రక్ష, నిత్య హీరో హీరోయిన్స్‌గా తెరకెక్కిన చిత్రం ‘హూ’. ఇటీవలే ఈ చిత్రం డబ్బింగ్, ఎడిటింగ్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. చిత్ర ట్రైలర్‌ను ప్రొడ్యూసర్ కౌన్సిల్ కోశాధికారి ప్రసన్న కుమార్, ఆర్టిస్ట్ నాగ మహేష్‌లు సంయుక్తంగా ఆవిష్కరించగా, పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత ఆచంట గోపీనాథ్, నిర్మాత శోభారాణి , ఛాంబర్ ఉపాధ్యక్షుడు కొల్లి రామ కృష్ణ సంయుక్తంగా ఆవిష్కరించారు.

ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు ఈశ్వర్,బలగం ఫేం సంజయ్, నిర్మాత విజయ్, డిస్ట్రిబ్యూటర్స్ మురళి కృష్ణ, రాందేవ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రెడ్డమ్మ కె.బాలాజీ మాట్లాడుతూ “జెడి చక్రవర్తి స్వీయ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపుదిద్దుకున్న ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ ‘హూ’.ఈ చిత్రంలో జెడి చక్రవర్తి నటన చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాము”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News