Monday, January 27, 2025

అమెరికన్లు ఎక్కువ మంది పిల్లల్ని కనాలి : జేడీ వాన్స్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికాలో పిల్లల సంఖ్య పెరగాలని దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. తాజాగా నిర్వహించిన యాంటీ అబార్షన్ ర్యాలీలో పాల్గొన్న వాన్స్ మాట్లాడుతూ అమెరికాలో పిల్లల సంఖ్య పెరగాలని, అందుకు అమెరికన్లు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని తాను కోరుకుంటున్నట్టు అభిప్రాయం వ్యక్తం చేశారు. జీవితానికి విలువనిచ్చే సంస్కృతిపై దృష్టి సారించి , కుటుంబాలను ఆదుకోవడానికి పిల్లలను పెంచడానికి అమెరికా ప్రభుత్వం మరింత సాయం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. అబార్షన్‌లను ప్రోత్సహించడం ద్వారా కొన్ని తరాలు భవిష్యత్తును కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. భావితరాలపై ఇప్పటివారికి ఉండాల్సిన బాధ్యతను గుర్తించడంలో ప్రస్తుత సమాజం విఫలమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అమెరికాలో పుట్టబోయే బిడ్డలను రక్షించడానికి తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. తమ పిల్లలను ఆనందంగా ఈ ప్రపంచం లోకి ఆహ్వానించే యువతను దేశం కోరుకుంటోందని వాన్స్ తెలిపారు. దేశ అభివృద్ధిని , జాతీయ ఆదాయాన్ని జీడీపీతో కాకుండా దేశంలో అభివృద్ధి చెందుతున్న , ఆరోగ్యకరమైన కుటుంబాలను ఏర్పాటు చేసుకుంటున్న వ్యక్తుల సామర్ధం ద్వారా కొలవాలని సూచించారు. అమెరికా లోని లాస్ ఏంజెలెస్ లో కార్చిచ్చు విస్తరిస్తుండడంతో ఆ ప్రాంతాలను సందర్శించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెళ్లారు. అందువల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. అయితే అబార్షన్‌ల గురించి ఆయన మాట్లాడుతూ ఓ వీడియో విడుదల చేశారు. గర్భవిచ్ఛిత్తిపై నిషేధానికి తాను పూర్తి అనుకూలం కాదని, దానికి తాను ఎప్పటికీ మద్దతివ్వనన్నారు. ఎనిమిది, తొమ్మిది నెలల్లో గర్భవిచ్ఛిత్తి ఎలా చేస్తారని ప్రశ్నించారు. అది ప్రమాదకరం కాబట్టి నెలలు నిండిన తరువాత చేసే అబార్షన్‌లను తాను ప్రోత్సహించనని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News