Sunday, December 22, 2024

కాంగ్రెస్ సర్కార్‌పై జెడిఎస్‌తో కలసి పోరాటం: యడియూరప్ప

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకలో తమ పార్టీ, హెచ్‌డి కుమారస్వామి సారథ్యంలోని జనతా దళ్(ఎస్) కలసి భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడతాయని మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు యడియూరప్ప మంగళవారం ప్రకటించారు.

కుమారస్వామి చెబుతున్నదంతా వాస్తవమని, ఆయన ప్రకటనకు తాను మద్దతు తెలుపుతున్నానని విలేకరులతో మాట్లాడుతూ యడియూరప్ప తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వాగ్దానాలను నెరవేర్చని పక్షంలో బిజెపి రాష్ట్రప్యాప్తంగా ఆందోళన చేపడుతుందని ఆయన చెప్పారు. బిజెపి ఎటువంటి డిమాండ్లు చేయడ ం లేదని, ప్రజలకు చేసిన ఐదు వాగ్దానాలను అమలు చేయమని మాత్రమే తాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐదు వాగ్దానాల అమలు కోసం ఒక వారం రోజుల వ్యవధి ఇస్తున్నామని, అలా జరగని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

కాగా..కర్నాటకలో మరో అజిత్ పవార్ తయారవుతున్నారని మరో ప్రకటనలో కుమారస్వామి వ్యాఖ్యానించారు. బిజెపికి మద్దతివ్వాలన్న అజిత్ పవార్ నిర్ణయం కర్నాటకలో కూడా పునరావృతం అవుతుందేమోనన్న ఆనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News