Wednesday, January 22, 2025

ఎన్‌డిఎలో చేరితే జెడిఎస్‌లో చీలిక అనివార్యం

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: ఎన్‌డిఎలో చేరిక కోసం ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఆహ్వానం కోసం మాజీ ప్రధాని, జెడిఎస అధినేత హెచ్‌డి దేవె గౌడ ఒక పక్క ఎదురుచూస్తుండగా ఈ చర్యను వతిరేకిస్తున్న జెడిఎస్ కేరళ విభాగం పార్టీతో తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధపడుతోంది.

కేరళలో అధికార ఎల్‌డిఎఫ్‌లో బాగస్వామ్య పక్షమైన జెడిఎస్ ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కె కృష్ణమూర్తి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితులలోనూ బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎలో చేరే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఒకవేళ జెడిఎస్ అధిష్టానం ఎన్‌డిఎలో చేరాలని నిర్ణయించిన పక్షంలో తాము మాత్రం అధికార సిపిఎం సారథ్యంలోని ఎల్‌డిఎఫ్‌లోనే కొనసాగుతామని ఆయన స్పష్టం చేశారు.

బిజెపి సిద్ధాంతాలు, విధానాలకు తాము పూర్తి వ్యతిరేకులమని, బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎలో జెడిఎస్ చేరిన పక్షంలో కేరళలో మాత్రం తాము చేరే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు. భావసారూప్యత ఉన్న ఎల్‌డిఎఫ్‌లోనే కొనసాగుతామని కృష్ణమూర్తి తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి జులై 18న ఢిల్లీలో నిర్వహిస్తున్న ఎన్‌డిఎ సమావేశానికి జెడిఎస్ అధ్యక్షుడు దేవెగౌడ హాజరైన పక్షంలో తమ జాతీయ పార్టీతో సంబంధాలు తెగతెంపులు చేసుకోవడానికి సైతం జెడిఎస్ కేరళ శాఖ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News