- Advertisement -
బెంగళూరు: జెడి(ఎస్) ఎంఎల్సి సూరజ్ రేవన్నకు ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.మాజీ మంత్రి హెచ్.డి.రేవన్న కుమారుడైన సూరజ్ రేవన్నకు ప్రత్యేక కోర్టు జడ్జీ సంతోష్ గజానన్ భట్ బెయిల్ అప్లికేషన్ దాఖలుకు అనుమతించారు. రూ. 200000 పర్సనల్ బాండ్ సమర్పించాక సూరజ్ కు బెయిల్ ఇచ్చారు. సాక్ష్యాలను మార్చకూడదని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు దర్యాప్తు అధికారుల ముందు హాజరుకావాలని షరతులు విధించారు. పైగా పిటిషనర్ ఎప్పుడూ నేరుగా గానీ, అప్రత్యక్షంగా కానీ బాధితులను కలువరాదని, ఆరు నెలలపాటు ఉదయం 9.00 నుంచి 5.00 గంటల మధ్య నెలలో ప్రతి రెండో ఆదివారం దర్యాప్తు అధికారి ముందు హాజరై అటెండెన్స్ ఇవ్వాలి అని షరతులు పెట్టారు. ఆయన మీద హోలెనరసిపురా రూరల్ పోలీస్ స్టేషన్ ఆయనపై కేసు రిజిష్టరు చేసింది.
- Advertisement -