Sunday, November 17, 2024

లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తాం: దేవెగౌడ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జనతా దళ్(సెక్యులర్) స్వతంత్రంగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మంగళవారం ప్రకటించారు. అధికార ఎన్‌డిఎతో ఎన్నికల పొత్తు కుదుర్చుకునే ప్రసక్తి లేదని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు.

కాగా..దేవెగౌడ కుమారుడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి గత వారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ అంశాలలో బిజెపితో కలసి పోరాడతామని వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశం ఉందన్న ఊహాగానాలు తలెత్తాయి. ఇటీవలే అమర్యాదకర ప్రవర్తనకు పాల్పడిన 10 మంది బిజెపి ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన దరిమిలా జెడి(ఎస్), బిజెపి మ్మెల్యేలు కలసికట్టుగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు.

ఈ నేపథ్యంలో మంగళవారం నాడిక్కడ విలేకరులతో దేవెగౌడ మాట్లాడుతూ 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో జెడి(ఎస్) స్వతంత్రంగా పోటీ చేస్తుందని ప్రకటించడం విశేషం. మా పార్టీ ఐదు, ఆరు, మూడు, రెండు లేదా ఒక్క సీటును గెలుచుకోనివ్వండి కాని లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తాము. మా పార్టీ కార్యకర్తలను సంప్రదించి మా పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలలోనే అభ్యర్థులను పోటీపెడతామని దేవెగౌడ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News