Friday, December 20, 2024

3 మంత్రి పదవులు ఆశిస్తున్న జెడియు

- Advertisement -
- Advertisement -

గౌరవప్రదమైన ప్రాతినిధ్యం కల్పించాలి
రైల్వే, వ్యసాయం, గ్రామీణాబిశృద్ధి కన్ను

పాట్నా: కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీతోపాటు కీలకం మారిన జనతా దళ్(యునైటెడ్) కొత్త ప్రభుత్వంలో మూడు మంత్రి పదవుల వరకు ప్రయత్నిస్తోందని నితీష్ కుమార్ సారథ్యంలోని జెడియు సీనియర్ నాయకుడు ఒకరు గురువారం వెల్లడించారు. ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలలో బిజెపి తరువాత 16 ఎంపి సీట్లతో టిడిపి రెండవ స్థానంలో ఉండగా 12 స్థానాలతో జెడియు ఆ తరువాతి స్థానంలో ఉంది.

మంత్రిపదవులు, ఇతర అంశాలపై బిజెపి నాయకులు ఈ రెండు భాగస్వామ్య పక్షాలతో మంతగనాలు జరుపుతున్నట్లు తెలుసోంది. ప్రస్తుతం మూడు మంత్రి పదవువ వరకు ఆశిస్తున్నామని జెడియు నాయకుడు తెలిపారు. కేంద్ర మంత్రి మండలిలో గౌరవనీయ ప్రాతినిధ్యాన్ని ఆశిస్తున్నట్లు జెడియుకు చెందిన మరో సీనియర్ నాయకుడు తెలిపారు. మంత్రి పవదవుల విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, తమ పార్టీ అధ్యక్షుడు నితీష్ కుమార్ నిర్ణయిస్తారని, అయితే అది గౌరవప్రదంగా ఉండాలని జెడియు నాయకుడు, బీహార్ గ్రామీణాభివృద్ధి మంత్రి శ్రవణ్ కుమార్ తెలిపారు. 2025లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర క్యాబినెట్‌లో మంత్వ్రిర్గంలో ప్రాతినిధ్యంపై నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. 2019లో ప్రధాని నరేంద్ర మోడీ నామమాత్రంగా ఇవ్వచూపిన ఒకే ఒక మంత్రిపదవిని నితీష్ కుమార్ తిరస్కరించారు.

అయితే రైల్వేలు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, జల వనరులు, భారీ పరిశ్రమలు వంటి శాఖలపైనే నితీష్ కుమార్ ఆసక్తి చూపుతున్నట్లు జెడియు వర్గాలు వెల్లడించాయి. మంత్రి పదవులను ఆశిస్తున్న పార్టీ సీనియర్ నేతలలో రాజ్యసభ సభ్యుడు సంజయ్ ఝా, లోక్‌సభ సభ్యులు రాజీవ్ రంజన్ సింగ్ లలన్, కౌశలేంద్ర కుమార్, రాంప్రీత్ మండల్, లవ్లీ ఆనంద్ ఉన్నట్లు వర్గాలు తెలిపాయి. అంతకుముందు పారీ అధికార ప్రతినిధి కెసి త్యాగి న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ అగ్నిపథ్ పథకాన్ని సమీక్షించాలని డిమాండ్ చేశారు.దేశవ్యాప్తంగా కులగణన నిర్వహణను కూడా కోరతామని ఆయన చెప్పారు. అయితే ఎన్‌డిఎకి తమ పార్టీ బేషరతుగామద్దతు ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఎటువంటి ముంస్తు షరతు లేదని, బేషరతుగా మద్దతు ఇస్తున్నామని ఆయన చెప్పారు. అయితే బీహార్‌కు ప్రత్యేక తరగతి హోదా(ఎస్‌సిఎస్) ఇవ్వాలన్న డిమాండుపై తాము స్పష్టమైన వైఖరితో ఉన్నామని, విభజన అనంతరం బీహార్ ఎదుర్కొన్న పరిస్థితిని ప్రత్యేక హోదాతో తప్ప మరిదేనితో సరిచేయలేరని త్యాగి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News