Thursday, January 23, 2025

బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు బిజెపి షాక్

- Advertisement -
- Advertisement -

 

Nitish and Manipur MLAs coup

పాట్నా: మణిపూర్ రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ,  జనతాదళ్(యునైటెడ్)కు షాక్ ఇచ్చింది. బీహార్ రాష్ట్రంలో బిజెపికి జేడీ(యూ)కు చెందిన నితీష్ కుమార్పార్టీతో ఉన్న మైత్రీ బంధం ఇటీవల తెగిపోయిన నేపథ్యంలో మణిపూర్ లో జేడీయూకు చెందిన  ఐదుగురు ఎమ్మెల్యేలను కమలం గూటిలో చేర్చుకోవడం సంచలనం రేపింది. మణిపూర్ లో జేడీయూకు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండగా, ఐదుగురు బిజెపిలోకి ఫిరాయించారు. మణిపూర్ రాష్ట్రంలో జేడీయూ ముక్త్ లక్ష్యంతో తమ బిజెపి పనిచేసిందని బిజెపిఎంపీ సుశీల్ మోదీ వ్యాఖ్యానించారు. బిజెపిలో చేరిన వారిలో జేడీయూకు చెందిన కుముకచమ్ సింగ్ నగుర్ సంగ్లూర్ సనాటే, అచాబ్ ఉద్దీన్, తంఘజం అరుణ్ కుమార్, ఎల్ఎం ఖాటీలున్నారు. మణిపూర్ లో ఐదుగురు జేడీ యూ ఎమ్మెల్యేలు బిజెపిలో విలీనమయ్యారని అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు. మైత్రీబంధం తెగిన తర్వాత బిజెపి బీహార్ సీఎం నితీష్ కుమార్ కు రెండోసారి షాక్ ఇచ్చింది.

అరుణాచల్ ప్రదేశ్ లో జేడీయూ ఎమ్మెల్యే టేకి కసో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బిజెపిలో చేరారు. 2019 అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుగురు జేడీయూ ఎమ్మెల్యేలు విజయం సాధించగా వారందరూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయకండువాలు కప్పుకున్నారు. పార్టీ ఫిరాయింపులను బిజెపి ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో 2024 ఎన్నికల్లో కమలం పార్టీని ఓడిస్తామని జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News