Sunday, November 3, 2024

యూపీలో జెడి(యు) పోటీచేసే సీట్ల గుర్తింపు

- Advertisement -
- Advertisement -

Tyagi
పాట్నా: బీహార్‌లో అధికారంలో ఉన్న జెడి(యు) పార్టీ ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 2007 తర్వాత ఇప్పుడు మొదటిసారిగా రంగంలోకి దిగుతోంది. తమ పార్టీ పోటీచేయనున్న సీట్లను గుర్తించి ఆ జాబితాను త్వరలో తమ మిత్రపక్షమైన బిజెపికి ఇవ్వనున్నట్లు జెడి(యు) ప్రతినిధి కెసి త్యాగి తెలిపారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రచారం చేయబోవడం అధికార ఎన్‌డిఎ కూటమికి గణనీయం తోడ్పడగలదని కూడా త్యాగి తెలిపారు.
“ రానున్న ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో మేము పోటీచేయాలనుకుంటున్న సీట్లను గుర్తించే ప్రక్రియను మొదలుపెట్టాం. ఆ సీట్లు వారణాసి, ప్రయాగ్‌రాజ్, డియోరియా, కాన్పూర్‌” అని ఆయన వివరించారు. ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని తమ పార్టీ 2012కన్నా ముందే సిద్ధమైందని, కానీ బిజెపి కోరిక మేరకు నాడు పోటీ నుంచి ఉపసంహరించుకున్నామని కూడా త్యాగి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News