Wednesday, January 22, 2025

ఇన్సూరెన్స్ కేసులో సత్యపాల్ మలిక్‌కు సిబిఐ నోటీసులిచ్చాకే జెడి(యు) మద్దతు!

- Advertisement -
- Advertisement -

పాట్నా: రిలయన్స్ ఇన్సూరెన్స్ కుంభకోణం కేసులో జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మలిక్‌కు సిబిఐ నోటీసులిచ్చిన నేపథ్యంలో జెడి(యు) అధ్యక్షుడు లాలన్ సింగ్ శనివారం కేంద్రాన్ని ‘పిరికిపంద’(కవర్డ్)గా అభివర్ణించారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న వారినే లక్షం చేస్తున్నారని మండిపడ్డారు.

ట్విట్టర్ పోస్ట్‌లో సింగ్ ఇలా రాశారు: ‘మలిక్ సాహెబ్ పోరాడుతున్నారు. కానీ ‘పిరికివాళ్లు’ తమ ప్రత్యర్థులను లక్షం చేసుకోడానికి ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగిస్తున్నారు. దేశప్రజలు గమనిస్తున్నారన్న విషయం వారికి తెలియడంలేదు. మీరు(సత్యపాల్ మలిక్) వాస్తవాన్ని (పుల్వామా ఘటనకు సంబంధించినది) వెల్లడించిన రోజున మీపై చర్య తీసుకుంటారన్న భయం కలిగింది’. ‘సర్ఫరోషి కీ తమన్నా అబ్ హమారే దిల్ మే హై, దేఖ్‌నా హై జోర్ కిత్నా బాజుయేకాతిల్ మే హై’ అన్నారు.

కేంద్రాన్ని లక్షం చేస్తూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. అందులో ‘చివరికి, ప్రధాని మోడీ అదుపు చేయలేకపోయారు. సత్యపాల్ మలిక్ ఆయనని దేశం ముందు బట్టబయలు చేశారు. కనుకే సిబిఐ ఆయనను పిలిచింది. ఇది ముందుగా ఊహించిందే’ అన్నారు.
తనను ఏప్రిల్ 27 లేక 28 తేదీల్లో తమ ముందు హాజరు కావాలని సిబిఐ కోరిందని మాజీ గవర్నర్ సత్యపాల్ మలిక్ ఇదివరకే తెలిపారు. అవినీతి కేసుల్లో సిబిఐ కొన్ని స్పష్టీకరణలను తన నుంచి కోరుకుంటోందని అన్నారు. సత్యపాల్ మలిక్ 2018 ఆగస్టు 23 నుంచి 2019 అక్టోబర్ 30 వరకు జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా పనిచేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News