Monday, December 23, 2024

నేడు జెఇఇ అడ్వాన్స్‌డ్

- Advertisement -
- Advertisement -

నేడు జెఇఇ అడ్వాన్స్‌డ్
ఉదయం 9 గంటల నుంచి పేపర్ – 1
మధ్యాహ్నం 2.30 నుంచి పేపర్ – 2
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటిలలో ప్రవేశాలకు నిర్వహించే ఆదివారం(జూన్ 4) జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించేందుకు ఐఐటి గుహవాటి ఏర్పాట్లు చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష ప్రారంభ సమయం తరువాత నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. నిమిషం ఆలస్యమైనా లోపలకు అనుమతించరు.

పరీక్ష ముగిసేవరకు బయటకు వెళ్లేందుకు అవకాశం ఉండదు. విద్యార్థులు అడ్మిట్‌కార్డుతో పాటు ఇతర అధికారిక గుర్తింపుకార్డు తీసుకురావాలి. పెన్నులు, పెన్సిళ్లు, పారదర్శకంగా ఉంటే వాటర్ బాటిల్‌ను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. దేశ వ్యాప్తంగా 1.9 లక్షల మంది పరీక్షలు రాయనున్నారు. అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు దేశంలోని 23 ఐఐటీల్లో బి.టెక్ సీట్లకు పోటీ పడొచ్చు. జెఇఇ అడ్వాన్స్‌డ్ ఫలితాలు ఈ నెల 18న వెల్లడించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News