Tuesday, January 21, 2025

మే 18న జెఇఇ అడ్వాన్స్‌డ్

- Advertisement -
- Advertisement -

దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో వచ్చే విద్యాసంవత్సరానికి బి.టెక్, బి.ఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షను 2025 మే 18వ తేదీన నిర్వహించనున్నారు. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు వహిస్తున్న ఐఐటి కాన్పూర్ జెఇఇ అడ్వాన్స్‌డ్ 2025 వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో పరీక్ష షెడ్యూల్, సిలబస్‌ను పొందుపరించింది. జెఇఇ అడ్వాన్స్‌డ్‌కు అర్హులైన అభ్యర్థులు వచ్చే ఏడాది ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో ప్రస్తుత విద్యాసంవత్సరంలో 17,695 బి.టెక్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వచ్చే విద్యాసంవత్సరం మరికొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News