Thursday, January 23, 2025

వెబ్‌సైట్‌లో జెఇఇ అడ్వాన్స్‌డ్ అడ్మిట్ కార్డులు

- Advertisement -
- Advertisement -

JEE Advanced Admit Card 2022 released

ఈ నెల 28న పరీక్షలు…సెప్టెంబర్ 11న ఫలితాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జెఇఇ) అడ్వాన్స్‌డ్ 2022 పరీక్ష అడ్మిట్ కార్డులు(హాల్ టికెట్లు) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు https://jeeadv.ac.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఈ నెల 28న జరగనుంది. విద్యార్థుల రెస్పాన్సు కాపీలను సెప్టెంబర్ 1 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ప్రొవిజినల్ ఆన్సర్ కీని అదే నెల 3న విడుదల చేస్తారు. వీటిపై 3, 4 తేదీల్లో అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు. తుది ఆన్సర్ కీని, ఫలితాలను సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నారు. ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టుకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అదే రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ పరీక్షను సెప్టెంబర్ 14న నిర్వహించి ఫలితాలను 17న విడుదల చేస్తారు. కాగా, సెప్టెంబర్ 12 నుంచి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఆధ్వర్యంలో సీట్ల కేటాయింపునకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News