Sunday, December 22, 2024

గొట్టుగా గణితం

- Advertisement -
- Advertisement -

జెఇఇ అడ్వాన్డ్‌లో కఠినంగా
ప్రశ్నలు ఎన్‌సిఇఆర్‌టి
సిలబస్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్లు
2న ప్రాథమిక కీ విడుదల

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన జెఇఇ అడ్వాన్స్‌డ్ ప్రశ్నలు కఠినం గా ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరిగింది. ఈ పరీక్షలో గణితం ప్రశ్నలు కఠినంగా ఉండగా, భౌతికశాస్త్రం ప్రశ్నలు సుధీర్ఘంగా ఉన్నాయని, ఈ రెండు సబ్జెక్టులతో పోల్చితే రసాయన శాస్త్రం ప్రశ్నలు సులువుగా ఉన్నాయని పరీక్ష రాసిన విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

గణితంలో ఎక్కువ ప్రశ్నలు వెక్టాAరఱ్, జామెట్రీ, స్టాటిస్టిక్స్ నుంచి రాగా, భౌతిక శాస్త్రం ప్రశ్నులు ఎక్కువగా 11, 12 తరగతుల ఎన్‌సిఇఆర్‌టి సిలబస్ నుంచి వచ్చాయని పేర్కొన్నారు. ఫిజిక్స్‌లో ఆప్టిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటి, మోడర్న్ ఫిజిక్స్, థైరోడైనమిక్స్ నుంచి ప్రశ్నలు వచ్చాయి. రసాయశాస్త్రంలో ఎక్కువ ప్రశ్నలు ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వచ్చాయి. అలాగే ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఎన్‌సిఇఆర్‌టి సిలబస్ నుంచి డైరెక్ట్ ప్రశ్నులు వచ్చాయి.

2న ప్రాథమిక కీ విడుదల

జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లు ఈ నెల 31వ తేదీన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. జూన్ 2వ తేదీన జెఇఇ అడ్వాన్స్‌డ్ ప్రాథమిక కీ ని విడుదల చేసి, మరుసటి రోజు వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. వచ్చే నెల 9వ తేదీన జెఇఇ అడ్వాన్స్‌డ్ తుది కీ తో పాటు ఫలితాలతో వెల్లడించనున్నారు.

జూన్ 10 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, తెలుగు రాష్ట్రాల నుంచి 40 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారే ఐఐటీల్లో బి.టెక్ సీట్లకు పోటీ పడేందుకు అవకాశం ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News