Monday, January 20, 2025

జెఇఇ అడ్వాన్స్‌డ్ రెస్పాన్స్ షీట్లు విడుదల

- Advertisement -
- Advertisement -

జెఇఇ అడ్వాన్స్‌డ్ 2024 రెస్పాన్స్ షీట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 26వ తేదీన రెండు సెషన్లలో పరీక్ష జరిగింది. రెండు పేపర్లకు కలిపి మొత్తం 360 మార్కులకు పరీక్ష నిర్వహించారు. ఆదివారం(జూన్ 2) జెఇఇ అడ్వాన్స్‌డ్ ప్రాథమిక కీ ని విడుదల చేసి, మరుసటి రోజు వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. వచ్చే నెల 9వ తేదీన జెఇఇ అడ్వాన్స్‌డ్ తుది కీ తో పాటు ఫలితాలతో వెల్లడించనున్నారు. జూన్ 10 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, తెలుగు రాష్ట్రాల నుంచి 40 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు ఐఐటీల్లో బి.టెక్ సీట్లకు పోటీ పడేందుకు అవకాశం ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News