Saturday, January 11, 2025

నేడు జెఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 4వ తేదీన జరిగిన జెఈఈ అడ్వాన్స్‌డ్ 2023 ఫలితాలు సోమవారం(జూన్ 18) ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. ఈ పరీక్షకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లు ఈ నెల 9వ తేదీన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచగా, 11వ తేదీన జెఇఇ అడ్వాన్స్‌డ్ ప్రాథమిక కీ ని విడుదల చేసి, మరుసటి రోజు సాయంత్రం 5 గంటలకు అభ్యంతరాలు స్వీకరించారు. సోమవారం తుది కీ తో పాటు ఫలితాలతో వెల్లడించనున్నారు. ఈ నెల 19 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News