Wednesday, January 22, 2025

జెఇఇ అడ్వాన్స్‌డ్ ఫలితాలు.. వేద్ లహోటికి ప్రథమ స్థానం

- Advertisement -
- Advertisement -

మన దేశంలో ప్రతిష్టాత్మక ఐఐటిల్లో బిటెక్ సీట్ల భర్తీకి నిర్వహించిన జెఇఇ అడ్వాన్స్‌డ్ 2024 ఫలితా ల్లో విడుదలయ్యాయి. ఈ ఏడాది ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్ లహోటి 360 మార్కులకు 355 మార్కులు సాధించి జాతీయస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. ఐఐటి బాంబే జోన్‌కు చెందిన ద్విజ ధర్మేష్‌కుమార్ పటేల్ 332 మార్కులతో అమ్మాయిల విభాగంలో మొదటి స్థానంలో నిలిచారు. జె ఇఇ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థు లు మరోసారి సత్తా చాటారు. టాప్ టెన్ ర్యాంకర్లలో ముగ్గురు తెలుగు విద్యార్థులు ఉన్నారు.

ఐఐటి మద్రాస్ జోన్‌కు చెందిన బోగలపల్లి సందేశ్ 360 మార్కులకు 338 సాధించి జాతీయ స్థాయిలో మూడో ర్యాం కు సాధించగా, పుట్టి కుశల్‌కుమార్ 334 మార్కులతో ఐదో ర్యాంకు, అల్లడబోయిన ఎస్‌ఎస్‌డిబి సిద్విక్ సుహాస్ 329 మార్కుల తో 10వ ర్యాంకు సాధించారు. గత నెల 26న రెండు సెషన్లల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 1,80,200 మంది హాజరయ్యారు. అందులో 48,248 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వారిలో 7,964 మంది అ మ్మాయిలున్నారు. ఐఐటి మద్రాస్ జోన్ నుంచే

అత్యధికంగా 10,255 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ, బాంబే,రూర్కే, కాన్పూర్, గువహటి జోన్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40 వేల మంది రాయగా, ఈ పరీక్షలో తెలుగు విద్యార్థులు మరోసారి ప్రభంజనం సృష్టించారు. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల కాగా, ఆదివారం ఉదయం తుది కీ ని విడుదల చేసి, ఆ తర్వాత ఫలితాలను ప్రకటించారు. ఈ ఏడాది జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షకు ఐఐటీ మద్రాస్ నిర్వహించింది. ఫలితాల కోసం https:// jeeadv.ac.in వెబ్‌సైట్‌ను చూడవచ్చు. జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు ఐఐటీల్లో బి.టెక్ సీట్లకు పోటీ పడేందుకు అవకాశం ఉంటుంది.

మొదటి 10 ర్యాంక్లు సాధించిన టాపర్లు వీళ్లే..

1. వేద్ లహోటి
2. ఆదిత్య
3. భోగలపల్లి సందేష్
4. రిథమ్ కేడియా
5. పుట్టి కుశల్ కుమార్
6. రాజ్‌దీప్ మిశ్రా
7. ద్విజ ధర్మేష్‌కుమార్ పటేల్
8. కోడూరు తేజేశ్వర్
9. దుర్విన్ హేమంత్ దోషి
10. అల్లడబోయిన ఎస్‌ఎస్‌డిబి సిద్విక్ సుహాస్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News