Friday, November 22, 2024

7న జెఇఇ అడ్వాన్స్‌డ్ షెడ్యూల్

- Advertisement -
- Advertisement -

7న జెఇఇ అడ్వాన్స్‌డ్ షెడ్యూల్
కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్

మనతెలంగాణ/హైదరాబాద్: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జెఇఇ) అడ్వాన్స్‌డ్ షెడ్యూల్‌ను ఈ నెల 7వ తేదీన ప్రకటించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన సోమవారం ట్విటర్‌లో పోస్టు చేశారు. వచ్చే గురువారం జరిగే ‘లైవ్ డిస్కషన్’లో జెఇఇ అడ్వాన్స్‌డ్ తేదీలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. అదే చర్చలో ఐఐటిల్లో అడ్మిషన్ ప్రక్రియ, ప్రవేశ అర్హతల గురించి స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇటీవల జెఇఇ మెయిన్స్ 2021 పరీక్ష తేదీలను వెల్లడించారు. “ప్రియమైన విద్యార్థులారా, జనవరి 7వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఐఐటి అడ్మిషన్లు, జెఇఇ అడ్వానడ్స్ తేదీలను ప్రకటిస్తాను” అంటూ కేంద్ర మంత్రి పోఖ్రియాల్ ట్వీట్ చేశారు. కరోనా కారణంగా జెఇఇ మెయిన్స్ 2020లో అర్హత పొందిన విద్యార్థులు జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయలేకపోయారు. దీంతో జెఇఇ అడ్వాన్స్‌డ్ 2021లో నేరుగా పరీక్ష రాసేందుకు వారికి అవకాశం కల్పించారు. కరోనా కారణంగా పలు సాధారణ వార్షిక పరీక్షలు, జాతీయ ప్రవేశ పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి చర్చించనున్నారు.

JEE Advanced Schedule announced on Jan 7th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News