- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : జెఇఇ మెయిన్ ఫలితాలు ఈ నెలాఖరులో వెలువడే అవకావం ఉంది. ఈ నెల 6 నుంచి ప్రారంభమైన రెండో విడత జెఇఇ మెయిన్ పరీక్షలు ప్రారంభం కాగా, శనివారం (ఏప్రిల్ 15)తో ముగియనున్నాయి. జెఇఇ మెయిన్‌లో కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మంది విద్యార్థులను జెఇఇ అడ్వాన్స్‌డ్ రాయడానికి అర్హత కల్పిస్తారు. జూన్ 4వ తేదీన జరిగే ఆ పరీక్ష రాయడానికి జెఇఇ మెయిన్ 2 ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. జనవరిలో జరిగిన మొదటి విడత జెఇఇ మెయిన్‌కు 8.60 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 8.24 లక్షల మంది హాజరయ్యారు. రెండో విడతకు 9.40 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
- Advertisement -