Thursday, January 23, 2025

జెఇఇ మెయిన్ 2 రిజిస్ట్రేషన్లు ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశంలో ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జెఇఇ మెయిన్ సెషన్ -2కు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఎట్టకేలకు మొదలైంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌కు దాదాపు వారం తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో వెబ్‌సైట్‌లో ప్రత్యేక విండోను అందుబాటులోకి తీసుకొచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 7 నుంచే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. అయితే,ఆలస్యానికి కారణాలను వెల్లడించకుండా ఎన్‌టిఎ వ్యవహరిస్తున్న తీరుపై నిపుణులు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో బుధవారం దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఎన్‌టిఎ వెబ్‌సైట్‌లో లింకును అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త అభ్యర్థులతో పాటు మొదటి సెషన్ పరీక్ష రాసిన విద్యార్థులు కూడా రెండో విడత పరీక్షకు దరఖాస్తులు చేసుకోవచ్చు. జెఇఇ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 6, 8, 10, 11, 12 తేదీల్లో జరగనుండగా.. ఏప్రిల్ 13, 15 తేదీలను ఎన్‌టిఎ రిజర్వు చేసింది. దరఖాస్తుల ప్రక్రియ బుధవారం (ఫిబ్రవరి 15) నుంచి మొదలై మార్చి 12 రాత్రి 9 గంటల వరకు కొనసాగనుంది. పరీక్ష రుసుం చెల్లించేందుకు మార్చి 12న రాత్రి 11.50 గంటల వరకు అవకాశం ఉంటుందని ఎన్‌టిఎ ఒక ప్రకటనలో తెలిపింది.
పరీక్ష నిర్వహించే సిటీ, అడ్మిట్ కార్డుల డౌన్ లోడింగ్, ఫలితాలు ప్రకటించే తేదీలకు ముందుగానే వెల్లడిస్తామని.. ఆ సమాచారం కోసం విద్యార్థులు ఎప్పటికప్పుడు తమ అధికారిక వెబ్‌సైట్‌ను చూసుకోవాలని సూచించింది.

జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగిన జెఇఇ మెయిన్ సెషన్ 1 పరీక్షను రికార్డు స్థాయిలో ఎనిమిదిన్నర లక్షల మందికి పరీక్ష విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే. ఇటీవల తొలి విడత పరీక్ష ఫలితాలు విడుదల కాగా.. 20 మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ సాధించారు. అభ్యర్థులు ఒకటి కన్నా ఎక్కువ దరఖాస్తులు చేయొద్దని.. అలా చేస్తే అక్రమమార్గం అనుసరిస్తున్నట్టుగా పరిగణించాల్సి వస్తుందని ఎన్‌టిఎ హెచ్చరించింది. జెఇఇ మెయిన్ సెషన్ 2 పరీక్ష తర్వాత ఆలిండియా ర్యాంకులను ప్రకటిస్తారు. వీరిలో టాప్ 2.5లక్షల మంది విద్యార్ధులు జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అవకాశం కలుగుతుంది. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఎన్‌ఎస్‌ఐటీ తదితర ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశాల ప్రక్రియ మొదలవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News