Wednesday, January 22, 2025

హైదరాబాదీ ‘జై’ఇఇ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్-2023 సెషన్-2 శనివారం విడుదలయ్యాయి. ఈ నెల 6 నుంచి 15 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన సింగారపు వెంకట్ కౌండిన్య 300/300 మార్కులతో తెలుగువారిలో తొలి ర్యాంకు సాధించాడు. గ్రేటర్ నగరానికి చెందిన మరో విద్యార్థి సాయి దుర్గారెడ్డి ఆరో ర్యాంక్ సాధించాడు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు విద్యార్థి పీ.లోహిత్ ఆదిత్య సాయి రెండో ర్యాంకు, అమలాపురానికి చెందిన కే.సాయినాథ్ శ్రీమంతకు పదో ర్యాంకు వచ్చింది.

విద్యార్థులు తమ ఫలితాలను ఎన్‌టీఏ అధికారిక వెబ్ సైట్‌లో https: //jeemain. nta.nic.in/లో చూ సుకోవచ్చు. తమ అప్లికేషన్ నంబర్, పుట్టినతేదీ వివరాలను నమో దుచేసి స్కోర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ సెషన్-1 జనవరిలో జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 8.60 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 8.24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 6 నుంచి 15 వరకు జరిగిన సెషన్-2 పరీక్ష లకు 9.40 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా (పేపర్-1, 2)లకు 9 లక్షల మంది వరకు పరీ క్షకు హాజరైనట్టు సమాచారం.

నేటి నుంచి అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్లు

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు ఈ నెల 30 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాను న్నాయి. మే 7 వరకు దరఖాస్తు లు స్వీ కరిస్తారు. మే 29 నుంచి జూన్ 4 వరకు అడ్మిట్ కార్డుల ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 4న పరీక్ష జరుగనుంది.

43మందికి నూటికి నూరు
జెఇఇ మెయిన్ రెండో ఎడిషన్ ప రీక్షలో 43మంది అభ్యర్థులు వం దకు వంద స్కోరు సాధించారని ఈ పరీక్ష నిర్వ హించిన నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ తెలియజేసింది. అలాగే 15మంది అభ్యర్థులు స్క్రూటినీలో ఉన్నం దున వారి స్కోర్లను ఎన్‌టిఎ ఆపివేసిందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News