- Advertisement -
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జెఇఇ) మెయిన్ రెండో విడత పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) విడుదల చేసింది. ఏప్రిల్ 2,3,4,7,8 తేదీలలో పేపర్ 1 పరీక్షలు, ఏప్రిల్ 9న పేపర్ 2ఎ, 2బి పరీక్షలు జరుగనున్నట్లు వెల్లడించింది. జెఇఇ మెయిన్ పరీక్షలను ఏటా రెండు విడతల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి విడత పరీక్ష పూర్తి చేసి ఫలితాలను వెల్లడించగా, తాజాగా రెండో సెషన్ పరీక్ష నిర్వహణకు ఎన్‌టిఎ ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా పలు నగరాలతో పాటు విదేశాలలోని 15 నగరాలలో జెఇఇ మెయిన్ నిర్వహించేందుకు ఎన్‌టిఎ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే జెఇఇ రెండో విడత పరీక్షలకు సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్పుఉల, అడ్మిట్ కార్డులు విడుదల చేయనున్నారు.
- Advertisement -