దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో బి.టెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జెఇఇ మెయిన్ తొలి విడత పరీక్ష తుది కీ విడుదలైంది. జనవరి 22 నుంచి 29 వరకు నిర్వహించిన పేపర్ 1 తుది కీ ని సోమవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) విడుదల చేసింది. ఇటీవల ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను విడుదల చేసిన ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం తుది కీ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే ఫలితాలను వెల్లడించనున్నారు. జెఇఇ మెయిన్ పేపర్ 1కు సంబంధించిన తుది కీ నుంచి అన్ని సెషన్లకు కలిపి మొత్తంగా 12 ప్రశ్నల నుంచి డ్రాప్ అయినట్లు ఎన్‌టిఎ తెలిపింది. ఆయా ప్రశ్నలకు గానూ విద్యార్థులకు ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పన కలిపే అవకాశం ఉన్నది.
ఏప్రిల్ 1 నుంచి రెండో విడత పరీక్షలు
జెఇఇ మెయిన్ రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి 8 వరకు జరుగనున్నాయి. ఈ రెండు పరీక్షలలో వచ్చిన ఉత్తమ స్కోర్‌ను పరిగణలోకి తీసుకుంటారు. ఈ నెల 25 వరకు రెండో విడత జెఇఇ మెయిన్ 2 పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.