Monday, December 23, 2024

నేటి నుంచి జెఇఇ మెయిన్ తుది విడత పరీక్షలు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: నేటి నుంచి దేశ వ్యాప్తంగా జెఇఇ మెయిన్ తుది విడత పరీక్షలు జరుగనున్నాయి. దేశ వ్యాప్తంగా పరీక్షలకు 9.4 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచి లక్షన్నర మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ నెల 6,8,10, 11, 12, 15 తేదీల్లో రోజుకు రెండు విడతల్లో ఆన్‌లైన్ పరీక్షలు జరుగనున్నాయి. దేశంలో 330 నగరాలు, పట్టణాల్లో జెఇఇ మెయిన్ పరీక్షలు జరుగనున్నాయి. తొలి విడత జెఇఇ మెయిన్ పరీక్షకు 8.24 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ సారి దరఖాస్తుదారుల సంఖ్య 80 వేలకు పెరిగింది. తొలి, తుది విడతల్లో ఉత్తమ స్కోర్ ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు. సామాజిక వర్గాల వారీగా కటాఫ్ మార్కులు ఉంటాయి. జెఇఇ అడ్వాన్స్‌డ్ రాసేందుకు 2.5 లక్షల మందిని ఎంపిక చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News