Sunday, December 22, 2024

ఈ నెల చివరి వారంలో జెఇఇ మెయిన్ నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జెఇఇ మెయిన్ 2023 నోటిఫికేషన్ ఈ నెల చివరి వారంలో వెలువడే అవకాశం ఉంది. గత విద్యాసంవత్సరం నిర్వహించిన విధంగానే ఈసారి కూడా రెండు విడతల్లో జెఇఇ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.

జనవరిలో మొదటి సెషన్, ఏప్రిల్‌లో రెండో సెషన్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండింట్లో విద్యార్థులు ఏదో ఒక సెషన్‌కు లేదా రెండు సెషన్లకు హాజరుకావచ్చు. కొవిడ్ పరిస్థితులకు ముందు ఉన్న షెడ్యూల్ ప్రకారంగానే 2023 జెఇఇ మెయిన్ పరీక్షలు జరగనున్నట్లు సమాచారం. ఈసారి పరీక్ష నిర్వహణలో ఎలాంటి జాప్యం లేకుండా షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News