Monday, November 18, 2024

విద్యార్థులూ అలర్ట్..

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ : దేశం లోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ (2023) పరీక్షకు తేదీల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అలర్ట్. వచ్చేవారం లోపే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం. జేఈఈ మెయిన్ 2023 నోటిఫికేషన్ ఈ వారంలో విడుదల చేసే అవకాశం లేదని , వచ్చేవారంలో ఆగస్టు 30 నాటికి పరీక్ష తేదీలు వెల్లడించే అవకాశం ఉందని, సంబంధిత అధికారులు పేర్కొన్నట్టు వార్తలు వస్తున్నాయి.

అలాగే జేఈఈ మెయిన్ 2023 తొలివిడత జనవరిలో, రెండో విడత ఏప్రిల్ లో నిర్వహించే అవకాశం ఉంది. ఒకవేళ నవంబర్ 30 లోగా నోటిఫికేషన్ వస్తే తొలి విడత పరీక్షకు వెనువెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కానుంది. అయితే ఈ పరీక్షకు సంబంధించి ఇటీవల ఓ ఫేక్ నోట్ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేసిన నేపథ్యంలో అప్‌డేట్స్ కోసం ఎప్పటికప్పుడు జీమెయిన్. ఎన్‌టిఎ . ఎన్‌ఐసి. ఇన్ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తొలి సెషన్ ఏప్రిల్‌లో పెట్టాలంటూ పలువురి విజ్ఞప్తి

మరోవైపు, జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షను జనవరిలో నిర్వహించొద్దంటూ పలువురు విద్యార్థులు సామాజిక మాధ్యమాల వేదికగా ఎన్‌టీఏ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. తొలి విడత జేఈఈ మెయిన్ 2023 పరీక్షను ఏప్రిల్‌లో నిర్వహించాలని కోరుతూఏ ట్వీట్లు చేస్తున్నారు. జనవరిఫిబ్రవరిలో ఇతర పరీక్షలు ఉన్నందున రివిజన్‌కు సమయం కుదరదని పేర్కొంటున్నారు. అలాగే 12 వ తరగతి సిలబస్ కూడా ఇంకా పూర్తి కాలేదని, విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకోవాలంటూ హ్యాష్‌టాగ్‌తో ట్విటర్ వేదికగా కోరుతున్నారు. దీంతో పాటు ఈ ఏడాది అనేక బోర్డులు బోర్డు పరీక్ష ప్రాక్టికల్స్ కూడా జనవరి లోనే ప్రారంభిస్తున్నాయి.

గత ఏడాది తొలి విడత జూన్ 2029 తేదీల మధ్య జరగ్గా, రెండో సెషన్ పరీక్షను జులై 2130 తేదీల మధ్య నిర్వహించారు. ఈ రెండు విడతలకు 10.26 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వీరిలో 9,05, 590 మంది పరీక్షలు రాసిన విషయం తెలిసిందే. దేశం లోని ట్రిపుల్ ఐటీలు, ఎన్‌ఐటీ, ఇతర విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ( బిఇ/బిటెక్/ బి ఆర్చ్,) ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తోన్న జేఈఈ మెయిన్ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. వీరిలో ట్రాప్ స్కోర్ సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులకు ప్రఖ్యాత సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News