Monday, December 23, 2024

జెఇఇ మెయిన్ పేపర్-2 అడ్మిట్ కార్డులు విడుదల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జెఇఇ) మెయిన్ తొలి విడత పరీక్షలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను విడుదల చేసిన ఎన్‌టిఎ, తాజాగా పేపర్ -2 పరీక్షకు అడ్మిట్ కార్డులను విడుదల చేశారు. బి.ఆర్క్, బి.ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను ఎన్‌టిఎ అధికారిక వెబ్‌సైట్ https://jeemain.nta.ac.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా అడ్మిట్ కార్డులను పొందవచ్చు.

పేపర్ -1కు సంబంధించిన అడ్మిట్ కార్డులు ఇంకా విడుదల కావాల్సి ఉంది. దేశవ్యాప్తంగా జనవరి 24, 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జెఇఇ మెయిన్ తొలి విడత పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. గతేడాది కన్నా ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. దేశంలో దాదాపు 12.30 లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2.5 లక్షల మందికిపైగా ఉన్నారు. దేశంలోని ఎన్‌ఐటిలు, ట్రిపుల్ ఐటీల్లో బి.టెక్ కోర్సుల్లో ప్రవేశాలకు జెఇఇ మెయిన్ ర్యాంకులనే ప్రామాణికంగా తీసుకుంటారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News