హైదరాబాద్: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్-2023 సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్కు చెందిన సింగారపు వెంకట్ కౌండిన్య 300/300 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా,ఎపిలోని నెల్లూరు జిల్లాకు చెందిన విద్యార్థి పీ.లోహిత్ ఆదిత్య సాయి రెండో ర్యాంకు సాధించాడు. హైదరాబాద్ చెందిన సాయి దుర్గా రెడ్డి ఆరో ర్యాంక్ సాధించగా,
అమలాపురానికి చెందిన కే.సాయినాథ్ శ్రీమంతకు పదో ర్యాంకు వచ్చింది.విద్యార్థులు తమ ఫలితాలను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో https://jeemain.nta.nic.in/లో చూసుకోవచ్చు.జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు ఈ నెల 30 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. మే 7 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 29 నుంచి జూన్ 4 వరకు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 4న పరీక్ష జరుగనుంది.