Monday, January 20, 2025

వారంలో జెఇఇ మెయిన్ తొలి విడత ఫలితాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశంలో ప్రతిష్ఠాత్మక ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జెఇఇ మెయిన్ తొలి విడత పరీక్ష ఫలితాలు వారంలో వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) జెఇఇ మెయిన్ మొదటి విడత ప్రాథమిక కీని విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించగా, తుది కీ, ఫలితాలను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. గత నెల 24 నుంచి ఈ నెల 1 వరకు వివిధ తేదీల్లో జరిగిన జెఇఇ మెయిన్- 2023 తొలి విడత పరీక్షల కోసం దేశవ్యాప్తంగా దాదాపు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు.

అయితే, పేపర్ 1 (బిఇ/ బి.టెక్ కోర్సులు) పరీక్ష రాసేందుకు 8.22 లక్షల మంది హాజరు కాగా.. వీరిలో 2.6 లక్షల మందికి పైగా అమ్మాయిలు, 6 లక్షల మందికి పైగా అబ్బాయిలు ఉన్నారు. అలాగే, పేపర్ 2 (బి.ఆర్క్/బి.ప్లానింగ్) పరీక్షను 46 వేల మందికి పైగా రాయగా.. వీరిలో 25 వేల మంది అబ్బాయిలు, 21 వేల మందికి పైగా అమ్మాయిలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. జెఇఇ మెయిన్ రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు జరగనున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News