Saturday, November 23, 2024

తెలుగు విద్యార్థుల హవా

- Advertisement -
- Advertisement -

జెఇఇ మెయిన్ 2వ విడతలో 10మంది తెలుగువారికి 100 పర్సంటైల్
వారిలో తెలంగాణ మిగిలిన వారు ఎపికి చెందిన విద్యార్థులు

మన జెఇఇ మెయిన్ రెండో విడత ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా మొత్తం 24 మంది విద్యార్థులు వందకు వంద శాతం ప ర్సంటైల్ సాధించగా, అందులో ఎక్కువ మంది తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే ఉన్నారు. ఈ ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఐదుగురు, ఎపి నుంచి ఐదుగురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. తెలంగాణకు చెందిన విద్యార్థి రూ పేష్ బియాని, ధీరజ్ కురుకుండ, జాస్తి యశ్వంత్ వివిఎస్,బూస శివనాగ వెంటక ఆదిత్య, అనికెత్ ఛటోపాధ్యా య 100 పర్సంటైల్ సాధించగా, ఎపి నుంచి పెనికలపాటి రవికిశోర్, పి. హిమవంశీ, కొయ్యన సు హాస్, పల్లి జలజాక్షి 100 పర్సంటైల్ సాధించారు. మహారాష్ట్రకు చెందిన శ్రెనిక్ మో హన్ శకల మొదటి స్థానంలో నిలిచారు.

ఆ తర్వాత నవ్య, సార్థక్ మహేశ్వరి, కృష్ణ శర్మ, పార్థ్ భరద్వాజ్‌లు టాప్ 5లో నిలిచారు. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం ఉదయం ఫలితాలు వెల్లడించింది. ఈ ఫలితాలను jeemain.nta.nic.inలో తెలుసుకోవచ్చు. జెఇఇ మెయిన్ రెండో విడత పరీక్షలు జులై 25 నుంచి 30 వరకు జరిగాయి. మనదేశంతో పాటు విదేశాలలో సైతం మొత్తం 440 నగరాలలో 622 పరీక్షా కేంద్రాలలో 13 భాషలలో జెఇఇ మెయిన్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 6,22,034 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 5,40,242 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈఏడాది తెలంగాణ రాష్ట్రం నుంచి 50 వేలకుపైగా విద్యార్థులు మొదటి విడుత పరీక్షలకు హాజరయ్యారు.

టాపర్లు వీరే

జెఇఇ మెయిన్ రెండో సెషన్ ఫలితాల్లో 24 విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. తెలంగాణకు చెందిన చెందిన విద్యార్థి రూపేష్ బియాని, ధీరజ్ కురుకుండ, జాస్తి యశ్వంత్ వివిఎస్,బూస శివనాగ వెంటక ఆదిత్య, అనికెత్ ఛటోపాధ్యాయ 100 పర్సంటైల్ సాధించగా, ఎపి నుంచి పెనికలపాటి రవికిశోర్, పొలిశెట్టి కార్తికేయ,మెండ హిమ వంశీ, కొయ్యన సుహాస్, పల్లి జలజాక్షి 100 పర్సంటైల్ సాధించారు. జనరల్ ఇడబ్ల్యూఎస్ విభాగంలో ఎపికి చెందిన పాలిశెట్టి కార్తికేయ, భోగి సిరి టాప్ 5లో నిలిచారు. అలాగే ఒబిసి కేటగిరీలో ఎపికి చెందిన పల్లి జలాజాక్షి, మెండ హిమ వంశీ, కొయ్యన సుహాస్ టాప్ నిలవగా, ఎస్‌సి కేటగిరీలో ఎపికి చెందిన దయ్యాల జాన్ జోసెఫ్, తెలంగాణకు చెందిన కాకర జశ్వంత్ టాప్‌లో నిలిచారు. అదేవిధంగా ఎస్‌టి కేటగిరీలో ఎపికి చెందిన రత్నాల శ్రీ చరణ్ సింగ్ నాయక్, తెలంగాణకు చెందిన మాలోత్ విశాల్ నాయక్ టాప్ 5 నిలవగా, పిడబ్లూడి కేటగిరీలో తెలంగాణకు చెందిన మండల రాహుల్ టాప్ 5లో ఉన్నారు. అలాగే మహిళల విభాగంలో ఎపికి చెందిన పల్లి జలజాక్షి, తెలంగాణకు చెందిన చంద మౌమిత టాపస్ 38లో నిలిచారు.

రెండు సెషన్లకు 4,04,256 మంది హాజరు

జెఇఇ మెయిన్ పరీక్షల్లో ఈసారి రెండు సెషన్లకు 4,68,205 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 2,04,256 మంది హాజరయ్యారు. మొదటి సెషన్ 8,72,970 మంది దరఖాస్తు చేసుకోగా, 7,69,604 మంది హాజరయ్యారు. అలాగే రెండవ సెషన్‌కు 6,22,034 మందికి 5,40,242 మంది హాజరయ్యారు. ఈ రెండు సెషన్లకు మొత్తం 10,26,799 దరఖాస్తులు రాగా, అందులో 9,05,590 మంది దరఖాస్తుదారులు పరీక్షలకు హాజరయ్యారు. తొలి విడత పరీక్షలు జూన్ 24 నుంచి 30 వరకు జరగగా, రెండో సెషన్ పరీక్షలు జులై 25 నుంచి 30 వరకు జరిగాయి. ఈ రెండింటిలో ఎందులో ఎక్కువ స్కోర్ వస్తే దానినే పరిగణనలోకి తీసుకొని తుది ర్యాంకు ఖరారు చేయనున్నారు.

జనరల్ కటాఫ్ 88.44 మార్కులు

జెఇఇ మెయిన్‌లో కేటగిరీల వారీగా ఎన్‌టిఎ కటాఫ్ మార్కులు విడుదల చేసింది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 88.41 మార్కులను కటాఫ్‌గా నిర్ణయింయింది. 100 పర్సంటైల్ మధ్య మారుతూ ఉంటుంది. జనరల్ పిడబ్లూడి కేటగిరీకి 0.003 నుంచి 88.40, జనరల్ ఇడబ్లూఎస్ కేటగిరీకి 63.11 నుంచి 88.40, ఎస్‌సి కేటగిరీకి 43.08 నుంచి 88.40, ఎస్‌టి కేటగిరీకి 26.11 నుంచి 88.40, ఒబిసి కేటగిరీలో 67.0 నుంచి 88.40గా నిర్ణయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News